Balu
-
నీ వెంటే..
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాలు–స్నేహ జంటగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘నీ వెంటే నేను’. అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మించారు. ‘సినీ బజార్’ అనే డిజిటల్ థియేటర్లో ఈ చిత్రం అక్టోబరు 6న 177 దేశాల్లో విడుదల కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సినీబజార్ సీఈవో రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘నీ వెంటే నేను’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
‘నలుగురు అమ్మాయిల కథ’ మూవీ స్టిల్స్
-
గోవా వెళ్తున్న నలుగురు అమ్మాయిల కథ!
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో కీలక సన్నివేశాలు, పాటల, పోరాట దృశ్యాల చిత్రీకరణకు చిత్రబృందం గోవా వెళ్లనుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ... ‘మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. స్వతంత్ర్య భావాలున్న నలుగురి జీవితాల్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఈ నెల రెండో వారంలో గోవాలో మొదలు కానున్న సెకండ్ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మార్చిలో హైదరాబాదులో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశాం. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అన్నారు. -
ముదురుతున్న ఇన్పీ శాలరీ రగడ
ముంబై:దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ కు వ్యవస్థాపకుల మధ్య నెలకొన్న బోర్డు వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు భారీ వేతన పెంపుపై రగడ మరోసారి రాజుకుంది. ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి బహిరంగ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కంపెనీలో కింది స్థాయి ఉద్యోగుల జీతాలు 8 శాతం , ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతాలను 60 శాతం పెంచుకోవడం సరికాదంటూ ఆయన లేఖను విడుదల చేశారు. దీంతో వివాదం ముదురు పాకానపడుతోంది. ఫౌండర్ నారాయణ మూర్తి వాదనను బలపరుస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ (బాల) బోర్డు చైర్మన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ పరిష్కరించేందుకు బోర్డు ముందడుగు వేయాలన్నారు. అటు ఇన్ఫోసిస్ మాజీ ఉన్నతాదికారి మోహన్ దాస్ పాయి కూడా నారాయణమూర్తిగా మద్దతుగా స్పందించారు. నారాయణ మూర్తి చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారనీ దీనిపై చర్చ జరగాలని చెప్పారు. ప్రవీణ్ రావు జీతం అద్భుతంగా ఉంది తప్ప ఆయన పెర్ఫామెన్స్ కాదంటూ ఎద్దేవా చేశారు. ఇన్ఫీ అమెరికా కంపెనీకాదని, అమెరికా లేదా జపాన్ కంపెనీలతో పోల్చడం సరికాదని, ఒక భారతీయ కంపెనీలో ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లిస్టెడ్ కంపెనీ బోర్డులు పారదర్శకత పాటించాలని కోరారు. కాగా గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఇన్ఫోసిస్‌లో ఆందోళనలు చెలరేగినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఓఓ వేతన పెంపుపై తన వైఖరిని ఇన్ఫోసిస్ సమర్ధించుకుంది. ప్రమాణాల ఆధారంగానే ప్యాకేజీ చెల్లించినట్టు పేర్కొంది. ప్రమోటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాటతో సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగులు, ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి. దీంతో ఇంట్రా డేలో భారీగా నష్టపోయింది. -
శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విముక్తి కలిగించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో, ఆస్తుల కేసులో తీర్పు వెలువడే వరకు ప్రమా ణ స్వీకారంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించిన నేపథ్యంలో.. కున్నమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్ కనపడడం లేదని, ఆయన జాడ కనిపెట్టి, న్యాయస్థానంలో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఇలవరసన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాది కె.బాలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గురువారం వేర్వేరుగా హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు హాజరై అన్నాడీఎంకేకు చెందిన 130 ఎమ్మెల్యేలను విడిపించి, కోర్టులో హాజరు పర్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ... ఎమ్మె ల్యేలు కిడ్నాప్‌నకు గురికాలేదని, ఇంటివద్దనే సురక్షితంగా ఉన్నారని వాదించారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు స్పందిస్తూ... ఎమ్మె ల్యేల కిడ్నాప్ అంశంపై పిటిషన్ దాఖలు చేస్తేనే విచారణ చేపట్టగలమని అన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన చట్ట పంచాయిత్తు ఇయక్కం తరఫున సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాడు. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకూ సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశాడు. -
పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి
పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్లో పిల్లర్ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. గుంటల వద్ద ఎలాంటి సేఫ్టీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు అనంతపూర్ వాసులుగా గుర్తించారు. -
ఆమె కథేంటి?
బాలు, కౌశిక్, అనూష, రవళి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దమయంతి’. స్వీయ దర్శకత్వంలో నౌండ్ల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే జి.కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా, మరో ఎమ్మెల్యే జి.కిశోర్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. నౌండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘దమయంతి ఎవరు? ఆమె కథ ఏంటి? అన్నది సస్పెన్స్. మూడు షెడ్యూళ్లలోనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ వొంటెల, కెమేరా: ఎమ్ఎస్ కిరణ్ కుమార్, సంగీతం: ఎస్ఎస్ ఆత్రేయ. -
వ్యవసాయశాఖ జేడీ బాలుకు పదోన్నతి
మహబూబ్‌నగర్ వ్యవసాయం : జిల్లా వ్యవసాయశాఖ జేడీ బాలు పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై ఆరు నెలల క్రితం జిల్లా వ్యవసాయశాఖ జేడీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ డీడీలను జేడీలుగా పదోన్నతి కల్పించడంతో బాలు జేడీగా పదోన్నతి పొందారు. దీంతో ఆయన వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయం జేడీగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నమే కమిషనరేట్ కార్యాలయంలో జేడీగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలాఉండగా ఆయన స్థానంలో కరీంనగర్ జిల్లా వ్యవసాయశాఖ జేడీగా పనిచేస్తున్న సుచరిత జిల్లా జేడీగా బదిలీపై రానున్నారు. ఆమె జేడీఏ బాలు నుంచి మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది'
విశాఖ: ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని హింసిస్తోందని కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాలు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ముద్రగడ దీక్షను విరమించేదిలేదని స్పష్టం చేశారు. ముద్రగడకు బలవంతంగా వైద్యం చేసినా తర్వాత దీక్ష కొనసాగుతోందని వెల్లడించారు. ఏదైనా మాట్లాడాలంటే కాపు జేఏసీని సంప్రదించాలని ఆయన అన్నారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టులపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిదని ముద్రగడ తనయుడు బాలు చెప్పారు. కాగా, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది. -
150వ సినిమాలో బాలు నటిస్తాడు: చిరంజీవి
హైదరాబాద్ : సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి గురువారం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలు అనే చిన్నారితో ముచ్చటించారు. ఆదిలాబాద్ కు చెందిన పదేళ్ల బాలు గత ఏడాదిగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు భరోసా ఇచ్చినా... బాలు మాత్రం ఈమధ్య కాలంలో దిగులుగా కనిపించాడు. ఏంటా అని వైద్యులు ఆరా తీస్తే...తన అభిమాన నటుడు చిరంజీవిని చూడాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ...ఇవాళ ఎంఎన్‌జే ఆస్పత్రికి వెళ్లి బాలును కలిశారు. అంతేకాకుండా అతని కోసం ఖరీదైన బోలెడు బహుమతులు తీసుకు వెళ్లారు. బాలు దగ్గర కూర్చొని చిరంజీవి కబుర్లు చెప్పారు. అలాగే ఇంద్ర సినిమాలోని...'మొక్కేకదా అని పీకేస్తే...పీక కోస్తా అంటూ బాలు చెప్పిన డైలాగ్‌ను మరోసారి అడిగి చెప్పించుకున్నారు. తనతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న బాలు కోరికను తీర్చుతానని చిరంజీవి హామీ ఇచ్చారు. తన 150వ సినిమాలో బాలు నటించే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. తన కుమారుడి కోరిక మన్నించి చూసేందుకు వచ్చిన చిరంజీవికి ఈ సందర్భంగా బాలు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజ అనే చిన్నారిని ఖమ్మం వెళ్లి మరీ పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే హీరో మహేష్ బాబు కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులను కొంత సమయం గడిపి వారితో కబుర్లు చెప్పాడు. -
బతక లేక.. మెతుకు లేక..
కష్టాల కడలిలో ‘చెన్నమ్మ’ దెబ్బతిన్న కుమారుడి రెండు కిడ్నీలు ఓ కిడ్నీని దానం చేసిన తల్లి కాళ్లు విరిగిన భర్త దిక్కూమొక్కు లేక దీనావస్థలో పేద కుటుంబం మెరుగైన వైద్యం కోసం దాతల వైపు చూపు సాక్షి, సిటీబ్యూరో: ఆ నిరుపేద కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అటు బతుకుదెరువు సాగక, ఇటు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆ కుటుంబం సతమతమవుతోంది. కొడుకు రెండు కిడ్నీలు పాడైతే తల్లే ఓ కిడ్నీ దానం చేసింది. అదే సమయంలో భర్త గాయపడి మంచాన పడ్డాడు. ఇన్ని సమస్యల మధ్య ఆమె ఒక్కతే పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడి వైద్యం కోసం దాతల వైపు దీనంగా ఎదురు చూస్తోంది చెన్నమ్మ. మాలపాటి బాల చెన్నయ్య(38), చెన్నమ్మ(36)లు దంపతులు. వీరికి బాలు(14) అనే కుమారుడున్నాడు. వీరిది గుంటూరు జిల్లా నరసారావుపేట వెంగళరెడ్డి నగర్. నిరుపేద దళిత వర్గానికి చెందిన వీరు కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు బాలు స్థానికంగా ఏడోతరగతి చదువుతున్నాడు. గత ఏడాది బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఉస్మానియాలో వైద్యులు పరీక్షించి అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. బాలుకు ప్రాణం పోసేం దుకు తల్లి చెన్నమ్మ ముందుకు వచ్చింది. తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. నిమ్స్‌లో ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన రూ.2 లక్షలతోపాటు ఇళ్లు అమ్మగా వచ్చిన రూ.9 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలు ఖర్చు చేశారు. నెలనెలా డయాలసిస్‌కు హైదరాబాద్‌కు రాలేక ఇక్కడే కూకట్పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్‌లో భవన నిర్మాణ కూలీగా పనికి కుదిరా డు చెన్నయ్య. నాలుగు నెలల క్రితం చెన్నయ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటు కుమారుడి పరిస్థితి బాగాలేక ఇటు భర్త మంచాన పడడంతో చెన్నమ్మ తల్లడిల్లిపోయింది. ఆమె కిడ్నీ దానం చేసినందున నెలకు 30 రోజులు పని చేయలేని పరిస్థితి. అయినా ఎలాగోలా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భర్త, కుమారుడి మందులకే నెలకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతోంది. తనకు డబ్బులు చేతికివ్వాల్సిన అవసరం లేదని, కుమారుడుకి నెలనెలా డయాలసిస్, భర్త కోలుకునే వరకు మందులకు సహాయం చేస్తే చాలునని చెన్నమ్మ రెండు చేతులు జోడించి వేడుకొంటోంది. కరుణ చూపేవారెవరైనా 8106187906 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
దెయ్యాలపై పరిశోధన
శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నజీరానూరి సమర్పణలో చాంద్ పాషా దర్శకత్వంలో బేగం, ఖాదర్‌బాబు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆనంద్‌కుమార్, రాజా, కార్తీక్, ‘రోషం’ బాలు, అనూష, స్వప్న ముఖ్య తారలు. బుధవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి దేవీప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, సాయి వెంకట్ క్లాప్ ఇచ్చారు. వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘దెయ్యాలున్నాయా? అనే అంశంపై ముగ్గురు విద్యార్థులు పరిశోధన చేసి, బంగారు పతకం సాధిస్తారు. దెయ్యాలున్నాయని తేలిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు. ఇది రొమాంటిక్ హారర్ మూవీ అని, 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్. సన్నీ, కెమెరా: ఆనంద్ శ్రీరామ్, సహనిర్మాత: సల్మాన్‌ఖాన్.