'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది' | Mudragada padmanabham son balu claims AP govt | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది'

Published Sun, Jun 12 2016 3:42 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది' - Sakshi

'ప్రభుత్వం మా కుటుంబాన్ని హింసిస్తోంది'

విశాఖ: ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని హింసిస్తోందని కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాలు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ముద్రగడ దీక్షను విరమించేదిలేదని స్పష్టం చేశారు. ముద్రగడకు బలవంతంగా వైద్యం చేసినా తర్వాత దీక్ష కొనసాగుతోందని వెల్లడించారు.

ఏదైనా మాట్లాడాలంటే కాపు జేఏసీని సంప్రదించాలని ఆయన అన్నారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టులపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మంచిదని ముద్రగడ తనయుడు బాలు చెప్పారు. కాగా, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement