
గోకవరం: సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించే విధానం మంచిదని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటులు కూడా ఇదే విధానం కోరుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు కోరిన విషయం ఎమ్మెల్యే రోజా, మరికొందరు ఇటీవల ప్రస్తావించారన్నారు. మాజీ ఎగ్జిబిటర్‌గా తాను ఈ విధానాన్నే సమర్థిస్తానన్నారు.
చిత్ర నిర్మాణం కోసం హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని ఆన్‌లైన్‌లో టికెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్లేలా చూస్తే బాగుంటుందని సూచించారు. దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవన్నారు. ప్రతీ పైసా ఖర్చుకు పారదర్శకత ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment