వ్యవసాయశాఖ జేడీ బాలుకు పదోన్నతి | Promotin to Agreeculture JD Balu | Sakshi
Sakshi News home page

వ్యవసాయశాఖ జేడీ బాలుకు పదోన్నతి

Published Tue, Aug 30 2016 12:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

Promotin to Agreeculture JD Balu

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం : జిల్లా వ్యవసాయశాఖ జేడీ బాలు పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై ఆరు నెలల క్రితం జిల్లా వ్యవసాయశాఖ జేడీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ డీడీలను జేడీలుగా పదోన్నతి కల్పించడంతో బాలు జేడీగా పదోన్నతి పొందారు. దీంతో ఆయన వ్యవసాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయం జేడీగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నమే కమిషనరేట్‌ కార్యాలయంలో జేడీగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలాఉండగా ఆయన స్థానంలో కరీంనగర్‌ జిల్లా వ్యవసాయశాఖ జేడీగా పనిచేస్తున్న సుచరిత జిల్లా జేడీగా బదిలీపై రానున్నారు. ఆమె జేడీఏ బాలు నుంచి మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement