woman screaming a racist slur outside a pub in the UK: డ్రింక్ చేసేవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో మనం చూసే ఉంటాం. అయితే కొంతమంది బాగా తాగితే వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడటమే కాక చాలా దారుణంగా దూషిస్తారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తనను పబ్‌లోకి వెళ్లనివ్వు అంటూ సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది.
(చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి)
అసలు విషయంలోకెళ్లితే....యూకేకి చెందిన నటాషా విలియమ్స్ అనే 24 ఏళ్ల మోడల్ పబ్‌లోకి మళ్లీ ప్రవేసించకుండా అడ్డుకుంటున్నాడని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది. పైగా తన బ్యాగ్ పోయిందని అందువల్లే మళ్లా పబ్‌కి వచ్చాను నన్ను వెళ్లనివ్వు అంటూ అతని పై గట్టిగా అరిచింది. ఈ మేరకు సెక్యూరిటీ గార్డు చాలా రాత్రి అవ్వడం వల్ల మూసివేసే నిమిత్తం ఆమెను అనుమతించాడు. దీంతో ఆమె జాత్యహంకర దూషణలుకు పాల్పడింది.
అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కొందరు తాగిన మైకంలో మాట్లాడిందని సమర్ధిస్తే, మరికొందరు జాతివిద్వేషాలను తెరలేపినందుకుగానూ విలియమ్స్‌ని ఘూటుగా విలియమ్స్‌ని విమర్శించారు. అయితే ఈ సంఘటన తర్వాత ఆమె తల్లి తన కూతురు జాత్యహంకార దూషణలను ఉపయోగించినందుకు అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.
(చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే)
Comments
Please login to add a commentAdd a comment