security guard
-
‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ -
వైద్యురాలి కేసు సీబీఐకి
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచారం కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలిచి్చంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్‌కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారించడమే గాక క్రైం సీన్‌ను రిక్రియేట్ చేయనుంది. మరోవైపు తమ ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో దేశవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఓ ప్రబుద్ధుడు గత గురువారం రాత్రి ఓ ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చడం తెలిసిందే. దీనిపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. ఇందులో ఇతరుల హస్తమూ ఉందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పక్కాగా చెరిపేశారని ఆరోపించారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా ౖహైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. ప్రిన్సిపల్ తీరు క్షమార్హం కాదు ఈ ఉదంతంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు దారుణమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మండిపడ్డారు. ‘‘కాలేజీ క్యాంపస్ లోపల ఏకంగా మహిళా డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చినా ఆయన సత్వరం స్పందించలేదు. హత్య జరిగిందంటూ కనీసం సకాలంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇది క్షమార్హం కాదు’’ అంటూ తీవ్రంగా తలంటారు. వైద్య విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఘోష్ రాజీనామా చేయడం తెలిసిందే. మమత సర్కారు దాన్ని ఆమోదించకపోగా ఆయనను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ (సీఎన్ఎంసీహెచ్)కు బదిలీ చేయడంపై సీజే విస్మయం వెలిబుచ్చారు. తక్షణం సెలవుపై వెళ్లాలని ఘోష్‌ను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే దాకా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.డిమాండ్లకు కేంద్రం ఒప్పుకొంది: ఫోర్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఫోర్డా) మంగళవారం రాత్రి ప్రకటించింది. ‘‘మంత్రితో భేటీ అయ్యాం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు ఉద్దేశించిన కేంద్ర రక్షణ చట్టంపై ఫోర్డా సహకారంతో కమిటీ వేయాలనే ప్రధాన డిమాండ్‌ను 15 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు’’ అని తెలిపింది. -
రాష్ట్రపతి పర్యటన భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు
వెంకటాపురం (ఎం): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో పాల్గొనే భద్రతా సిబ్బందికి సోమవారం పాలంపేట గ్రామపంచాయతీ ఆవరణలో కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం రాష్ట్రపతి ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని చారిత్రక రామప్ప ఆలయానికి రానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేశారు. దేశంలో నాలుగో వేవ్ బీఎఫ్–7 వేరియెంట్ ప్రారంభం కావడంతో వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా రామప్పలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు? ఎమైనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయా? అనే విషయమై వైద్యాధికారులు ప్రకటించలేదు. -
నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...
అత్యాచార కేసులోని నిందితుడు అరెస్టును తప్పించుకునే క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దూసుకెళ్లాడు. దీంతో సదరు సెక్యూరిటీ గార్డుకి తీవ్ర గాయలపాలయ్యాడు. ఈ ఘటన నోయిడాలోని అమ్రపాలీ జోడియాక్ సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నీరజ్ సింగ్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు సింగ్‌పై కేసు నమోదైంది. ఆ కేసు విషయమై పోలీసులు అతన్న అరెస్టు చేసేందుకు పలుమార్లు అపార్ట్మెంట్ సోసైటికీ వచ్చినా... సింగ్ కనిపించకుండా తప్పించుకుని తిరగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు సింగ్ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారం అందడంతో సదరు సోసైటికి వచ్చారు పోలీసులు. దీన్ని పసిగట్టిన సింగ్ తన కారుతో తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో సింగ్‌ని సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సింగ్ చాలా కర్కశత్వంగా అతనిపై నుంచి కారుని దూసుకెళ్లిపోయాడు. ఇంతలో మరో అధికారి అతని కారుని వెంబడించి సదరు నిందితుడు సింగ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. (చదవండి: చికిత్స సమయంలో పేషెంట్‌ని కొట్టిన డాక్టర్!) -
బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అయోమయానికి గురౌతున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది. ప్రముఖులకు భద్రత కల్పించే బాడీగార్డులు క్షణం ఏమరపాటుగా ఉన్నా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ తమ యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటారు. ఇలాంటి టెక్నిక్స్‌లో ఫేక్ చేతులు ధరించడం కూడా ఒకటి కావడం గమనార్హం. అయితే ఫేక్ చేతుల విషయం కొత్తదేమీ కాదు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలుని వింతగా పట్టుకున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కృత్రిమ చేతి అయి ఉంటుందని అంతా అనుమానించారు. బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ గన్ పట్టుకుని సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఎన్-పీ90 గన్ను ఊపయోగిస్తారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందట. క్లారీటీ లేదు.. అయితే బ్రిటన్‌లో బాడీగార్డులు ఆయుధాలు కలిగిఉండటానికి వీల్లేదు. అందుకే కింగ్ చార్లెస్ బాడీగార్డులు కోటు లోపల చేతులతో గన్స్ పట్టుకునే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు. కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదు. అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావిస్తారు. చదవండి: చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం -
రక్షించినందుకు చెంపదెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు
ఇటీవలకాలంలో చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులంటే చిన్న చూపో ఏంటో తెలియదు. వారిపట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఐనా మనుషులన్నాక తప్పులు అనేవి సహజం. మందలించి వదిలేయాలి గానీ చేయి జేసుకోవడం అనాగరికం. ఇక్కడొక వ్యక్తి కూడా సెక్యూరిటి గార్డు పట్ల అలానే అనుచితంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళ్తే...గుర్గావ్లోని వరుణ్ నాథ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. ఐతే ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్మ్యాన్ని కూడా గట్టిగా కొడతాడు. #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards after being briefly stuck in lift; FIR filed I helped him get out of the lift within 3-4 minutes. As soon as he got out, he started beating me up: Guard Ashok Kumar (CCTV visuals) pic.twitter.com/mtcXOy8zTh — TOI Gurgaon (@TOIGurgaon) August 29, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో అపార్ట్మెంట్ గార్డులు వరుణ్‌నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేగాదు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో ఒక మహిళ గేట్ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...) -
సెక్యూరిటీ గార్డ్‌ను చితకబాదిన మహిళ.. వీడియో వైరల్!
లక్నో: వీధి శునకాలపట్ల క్రూరంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డ్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది ఓ మహిళ. పెద్ద కర్రతో కొడుతూ తిట్ల వర్షం కురిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియో పోలీసులకు చేరటంతో మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. వీడియోలోని ఆ యువతి తాను జంతు హక్కుల కార్యకర్తగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ వీడియోలో.. 20 ఏళ్లుపైబడిన ఓ మహిళ సెక్యూరిటీ గార్డుపై ఆగ్రహంతో ఊగిపోతోంది. పెద్ద కర్ర తీసుకుని చితకబాదుతూ తిట్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా వీధి శునకాల పట్ల కూర్రంగా ప్రవర్తించావని భాజపా ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఆ మహిళ. ఈ సంఘటనపై ఆగ్రా నగర ఎస్పీ వికాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. ‘సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కర్రతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా మహిళపై చట్టపరమైన చర్యలు చేపట్టారు ఆగ్రా పోలీసులు.’ అని తెలిపారు. మరోవైపు.. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న బాధితుడు అఖిలేశ్ సింగ్ తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యూఆగ్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ విక్రమ్ సింగ్. వైరల్ వీడియోలో ఉన్న మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ ఆఫీసర్ కాలనీలో పని చేస్తున్న క్రమంలో అటుగా వచ్చిన వీధి కుక్కలను తరిమేసేందుకు షూను వినియోగించినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. తాను ఎక్స్ సర్వీస్‌మెన్‌గా తెలిపాడు బాధితుడు. Shocking video from UP's #Agra! Woman thrashes, abuses society security guard over 'bad behavior' with dogs. pic.twitter.com/XrDSIbT43V — Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022 ఇదీ చదవండి: ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్.. అరగంట ఆలస్యమైనందుకు దాడి.. రౌడీల్లా రాత్రంతా బంధించి.. -
అడ్డుకున్నారని.. సెక్యూరిటీపై ట్రాన్స్జెండర్ల దాడి
సాక్షి,నిజాంపేట్(హైదరాబాద్): ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి రాయల్ విలేజ్ ఈశ్వర్రావు అనే వ్యక్తి సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం 3.50 గంటల ప్రాంతంలో కొందరు ట్రాన్స్జెండర్లు రాయల్ విలేజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్రావు, మరో సెక్యూరిటీ సిబ్బంది దుర్గాసింగ్‌లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లు వారిని నెట్టుకుంటూ కొట్టి గాయపరిచారు. దీంతో బాధితులు తమకు ప్రాణహాని ఉందని, ట్రాన్స్జెండర్లు తమపై దాడి చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించాలని కోరుతూ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణస్నేహితులు.. విధి ఆడిన ఆటలో ఆ నలుగురు.. -
ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ
woman screaming a racist slur outside a pub in the UK: డ్రింక్ చేసేవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో మనం చూసే ఉంటాం. అయితే కొంతమంది బాగా తాగితే వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడటమే కాక చాలా దారుణంగా దూషిస్తారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తనను పబ్‌లోకి వెళ్లనివ్వు అంటూ సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది. (చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి) అసలు విషయంలోకెళ్లితే....యూకేకి చెందిన నటాషా విలియమ్స్ అనే 24 ఏళ్ల మోడల్ పబ్‌లోకి మళ్లీ ప్రవేసించకుండా అడ్డుకుంటున్నాడని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది. పైగా తన బ్యాగ్ పోయిందని అందువల్లే మళ్లా పబ్‌కి వచ్చాను నన్ను వెళ్లనివ్వు అంటూ అతని పై గట్టిగా అరిచింది. ఈ మేరకు సెక్యూరిటీ గార్డు చాలా రాత్రి అవ్వడం వల్ల మూసివేసే నిమిత్తం ఆమెను అనుమతించాడు. దీంతో ఆమె జాత్యహంకర దూషణలుకు పాల్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కొందరు తాగిన మైకంలో మాట్లాడిందని సమర్ధిస్తే, మరికొందరు జాతివిద్వేషాలను తెరలేపినందుకుగానూ విలియమ్స్‌ని ఘూటుగా విలియమ్స్‌ని విమర్శించారు. అయితే ఈ సంఘటన తర్వాత ఆమె తల్లి తన కూతురు జాత్యహంకార దూషణలను ఉపయోగించినందుకు అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. (చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే) View this post on Instagram A post shared by @imjustleam -
డ్యూటీలో మందు తాగాడని ఫిర్యాదు.. కోపంతో గొంతు కోసి..
సెక్యూరిటీ గార్డులు అంటే కేవలం పని మాత్రమే కాదు నలుగురిని కాపాడే బాధ్యత కూడా. అందుకే ఆ ఉద్యోగంలో అప్రమత్తత అనేది చాలా అవసరం లేకపోతే వాళ్ళు పని చేస్తున్న ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని మందు తాగుతూ డ్యూటీ సరిగా చేయని ఓ సెక్యూరిటీ గార్డ్ కి చెప్పినందుకు ఒక వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని ఏరోనాటికల్ ఇంజినీర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలో జరిగింది. వివరాలు ప్రకారం... భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నగరంలోని ఓ అపార్ట్మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉన్నాడు. ఆ అపార్ట్మెంట్ లోనే సెక్యూరిటీ గార్డుగా ఉన్న బసంత్ అనే వ్యక్తి మందుకొట్టి మత్తులో డ్యూటీ సరిగా చేయడం లేదని గుర్తించాడు భాస్కర్. దీంతో అలా మద్యం సేవించి పని చేయడం సరికాదని హెచ్చరించాడు. ఇదే విషయాన్ని అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్‌లోనూ ప్రస్తావించాడు. ఈ ఘటన తో తన ప్రవర్తన మారకపోగా ఆగ్రహం తెచ్చుకున్న బసంత్.. మరుసటి రోజు వాకింగ్‌కు వెళ్లిన భాస్కర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆపై తన వెంటన తెచ్చుకున్న కత్తితో కిరాతకంగా అతని గొంతు కోసి అకాడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర్‌ను చూసిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బసంత్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం -
దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..
థానె: బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వీటిని అరికట్టడం అంత సులువులా కనిపించడం లేదు. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానె జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. థానె నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ సొసైటీలోని ఒక ఇంట్లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చి పోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఓ రోజు మంచినీళ్ల నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకుని వచ్చేలోపు అదును చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 3న ఈ దారుణం జరగగా.. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఉండేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను డాక్టర్ దగరకు తీసుకెళ్లగా నిజం బయటపెట్టింది. దీంతో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చదవండి: స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై... -
ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: కోవిడ్ -19 నుండి రక్షణ కోసం మాస్కలు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లోనూ షాపింగ్ మాల్స్, ఆఫీసులు, సినిమా హాళ్లు, ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాల్లో సెక్యూరిటి సిబ్బంది ప్రతి ఒక్కరి శీరీర ఉష్ణోగ్రతలను తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) అయితే ఆ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం వేలాది మందిని తనిఖీలు చేసే సమయంలో జనాల రద్దీ దృష్ట్యా కొంతమందిని తనిఖీ చేయకుండా వదిలేస్తారు. కానీ ఇక్కడొక సెక్యూరిటీ గార్డు అలాగే చేస్తే ఓ చిన్న పాప ఏం చేసిందో తెలుసా?. అంకుల్ నాకు కూడా ఉష్ణోగ్రతలను చెక్ చేయండి అంటూ రెండు చేతులు చాపుతుంది. దీంతో ఆ సిబ్బంది విస్మయంగా చూడటమే కాక ఆమె శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న చిన్న టెడ్డీబేర్ బొమ్మకు కూడా చెక్ చేయమని అడుగుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోతో పాటు " బాధ్యత గల ప్రతి పౌరుడు ఈ విధంగా ఉండాలి" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ చిన్నపాప యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిందంటూ ఆ పాపను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’) A responsible citizen should be like this. @hvgoenka pic.twitter.com/7phGPk4rfm — Dinesh Joshi (@officeofdnj) November 3, 2021 -
"నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!"
న్యూఢిల్లీ: చిన్నపిల్లలు వారి ముద్దు ముద్దు మాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల ముద్దులొలికే మాటలకు అప్పటి వరకు మనకు ఉన్న టెన్షన్లు, తనొప్పిలు ఎక్కడివక్కడికే ఎగిరిపోతాయి. పైగా వారి వచ్చిరాని మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాక విస్మయానికి గురిచేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఖతార్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) వివరాల్లోకెళ్లితే.....ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరాధ్య అనే చిన్నపాప తన అత్తకు వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్ని కోరుతోంది. ఆ తర్వాత ఆ సెక్యరిటీ గార్డు ఆ చిన్నారి మాటలకు నవ్వుతూ అంగీకారం తెలిపిన వెంటనే తన అత్త దగ్గరకు ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ సన్నివేశం చూపురులను తల తిప్పుకోనివ్వకుండా ఒక్క క్షణం కట్టిపడేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియోను కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) -
చిన్న కారణంతోనే మహిళా జర్నలిస్ట్ వేలు విరిచిన గార్డు
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక వార్తా వెబ్సైట్లో ఫేజె మోమెని అనే మహిళా జర్నలిస్ట్ పనిచేస్తుంది. ఈ కోవిడ్ సమయంలో టీకా ప్రక్రియ గురించి ఒక నివేదికను తయారు చేస్తున్నప్పుడు మే 18న రాష్ట్ర టీకా కేంద్రం వద్ద ఉన్న గార్డు ఆమెను కొట్టారు. టీకా కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా జర్నలిస్టును బెహేష్తి మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏజెంట్ కొట్టాడని ప్రభుత్వ ఈటెమాడ్ ఆన్లైన్ వెబ్సైట్ తెలిపింది. అప్పటివరకు సేకరించిన అన్ని ఇంటర్వ్యూలను డిలీట్ చేయమని గార్డు ఆమెను కోరాడు దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే అతను ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వేలు విరిగింది. అయితే, అక్కడ స్థానికులు ఫేజేను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె తనకు గాయాల ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె కేంద్రంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో వరుసగా ఇంటర్వ్యూలు నిర్వహించిందని, అయితే వాటిని తొలగించమని సెక్యూరిటీ గార్డు ఆమెకు చెప్పారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఆ దేశంలో నిదానంగా జరగుతున్న కోవిడ్ -19 టీకా ప్రచారం గురించి మీడియా, నిపుణులు పదేపదే ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శిస్తున్నారు. మరి మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడి యాదృశ్చికంగా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారో ఇంకా తెలియదు. ఇస్లామిక్ రిపబ్లిక్ లో మహిళలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల నిరుద్యోగం తీవ్రంగా పెరగినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ -
క్షణాల్లో బతికిపోయాడు...
సాక్షి, ముంబై: ప్రమాదమనీ, ప్రాణాంతకమనీ తెలిసినా ఏదో ఒక కారణంతో కొంతమంది కదిలే రైలునుంచి ప్లాట్‌ఫాం మీదికి దూకడం లాంటి చర్యల్ని మానుకోరు. ఇలాంటి దుందుడుకు చర్యతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించి ఉండకపోతే క్షణాల్లో ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. వాయువేగంగా కదలిన గార్డు పట్టు తప్పి పట్టాలపై పడిపోబోతున్న సదరు వ్యక్తిని కాపాడారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దిలీప్ భికాన్ మాండే (52) తన కుమారుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ వెళ్తున్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి యూపీకి చెందిన కామ్యాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే పొరపాటున వీరిద్దరూ బిహార్‌కు చెందిన పవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసారు.ఈ విషయాన్ని గ్రహించే సమయానికి, రైలు ప్లాట్‌ఫాం నుండి బయలుదేరుతోంది. దీంతో వారు సామానుతో పాటు కదిలే రైలు నుండి ప్లాట్‌ఫాంపై దూకేందుకు ప్రయత్నించారు. కుమారుడు బాగానే దూకేశాడు కానీ తండ్రి సైడ్ బార్ పట్టుకుని ఉండటంతో నియంత్రణ కోల్పోయాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు క్షణం ఆలస్యం చేయకుండా మాండే ను ట్రాక్‌పైకి జారిపోకుండా కాపాడారు. దీంతో మాండే స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోమనాథ్ మహాజన్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిప్) అధికారి కె సాహు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తన ప్రాణాలను కాపాడినందుకు సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
చాక్లెట్ చోరీ.. విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎల్. సతీష్(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్‌కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. డీమార్టులో చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
వీఆర్ఏలకు గార్డు విధులు!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయోగం చేపట్టింది. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు కొత్త రూపు ఇచ్చింది. వారికి ‘రక్షణ’ విధులు అప్పగించింది. రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సందర్శకుల రాకపోకలపై కన్నేసి ఉంచేందుకు సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే ప్రజల్లో కొందరు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదనే ఆక్రోశంతో అధికారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 4న తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆమె కార్యాలయంలోనే ఓ రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన ఈ కోవలోనిదే. విజయారెడ్డి సజీవదహనంతో అవాక్కయిన రెవెన్యూ యంత్రాంగం... వారం పాటు విధులు బహిష్కరించింది. తమకు రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించడంతో రంగంలోకి దిగిన సర్కారు రెవెన్యూ ఉద్యోగుల విధుల నిర్వహణకు పోలీసు రక్షణ కల్పించింది. కానీ క్రమేణా కానిస్టేబుళ్లను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యానే నిర్మల్ జిల్లా అధికారులు వీఆర్ఏలకు సెక్యూరిటీ గార్డు విధులు అప్పగించాలని నిర్ణయించారు. డ్రెస్‌కోడ్‌తో కొత్త అవతారమెత్తిన వీఆర్ఏల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే మండల కార్యాలయాలు, అధికారుల వద్ద ఆర్డర్లీ సేవలందిస్తున్న వీఆర్ఏలను తాజాగా సెక్యూరిటీ గార్డులుగా నియమించడంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురు... నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో రెవెన్యూ అధికారుల రక్షణ కోసం సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతి మం డలం నుంచి ముగ్గురు వీఆర్ఏలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళా వీఆర్ఏకు స్థానం కల్పించారు. 19 మండలాల నుంచి సెక్యూరిటీ గార్డులుగా విధుల కోసం 57 మందిని ఎంపిక చేసి వారికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో అధికారులను కలిసేందుకు వచ్చే ఫిర్యాదుదారులను చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించడం, వారు వెంట తీసుకువచ్చిన చేతిసంచులు, ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ పనిపై వచ్చారనే విషయాన్ని ఆరా తీయడం, అనుమానస్పదంగా ఉంటే వారిని అడ్డుకోవడం.. తదితర అంశాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. డ్రెస్‌కోడ్‌పై గరంగరం! వాస్తవానికి వీఆర్ఏల ప్రధాన విధి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)కి సహాయకులుగా వ్యవహరించడం. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండటంతో దాదాపు అన్ని మండల కార్యాలయాల్లో వీఆర్ఏల సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విడతలవారీగా ఆయా గ్రామాల వీఆర్ఏలను మండల ఆఫీసుల్లో విధులకు నియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం, ఆ తర్వాత కొన్ని మండలాల్లోనూ పెట్రోల్ సీసాలు, భౌతికదాడులకు పాల్పడతామంటూ కొందరు ఫిర్యాదుదారులు హెచ్చరికలకు దిగడంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం వీఆర్ఏలను సెక్యూరిటీ గార్డులుగా మార్చేసింది. అయితే విధుల నిర్వహణపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా డ్రెస్‌కోడ్‌పై మాత్రం ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతవిద్య అభ్యసించి వీఆర్ఏలుగా పనిచేస్తున్న తమకు డ్రెస్‌కోడ్‌ను వర్తింపజేయడం అవమానపరచడమేనని మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, తక్షణమే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపరిపాలన శాఖ డైరెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. -
బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట ఆందోళన
సాక్షి, బాసర : పెరిగిన జీతాలు చెల్లించలేదని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. గతేడాది (2018) జూలై నెలలో జీతాలు పెరగగా మే 2019 వరకు వాటిని చెల్లించలేదని సెక్యురిటీ సిబ్బంది ఆరోపించారు. క్యాంపస్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 180 మంది పెరిగిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. దాదాపుగా 10 నెలలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 29 లక్షలు చెల్లించాలని తెలిపారు. బకాయిల చెల్లింపు కోసం గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించిన లాభం లేకపోవటంతోనే ఇవాళ గేటు ఎదుట భైటాయించామని తెలిపారు. (చదవండి : బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు) -
చిలకలగుట్టకు రక్షకుడు
సాక్షి, మేడారం(వరంగల్) : సమ్మక్కతల్లి కొలువు దీరిన మేడారం చిలకలగుట్టకు ప్రత్యేకత ఉంది. చిలకలగుట్ట అపపవిత్రకు గురికాకుండా ఉండేందుకు మేడారం సమ్మక్క–సారలమ్మ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తల్లిగుట్ట వద్ద ఆదివాసీ యువకుడిని రక్షకుడిగా ఏర్పాటు చేశారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున గుట్టపైన కొలువైన సమ్మక్క తల్లిని పూజారులు కుంకుమ భరిణి రూపంలో అద్భుతమైన ఘట్టం మధ్య గద్దెపైకి తీసుకువస్తారు. పూజారులు తల్లిగుట్ట పవిత్రను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డు ఇతరులు గుట్టలోపలికి వెళ్లకుండా చూస్తున్నారు. పెరిగిన రక్షణ పూజారులు నియమించుకున్న సెక్యూరిటీ గార్డుతో తల్లిగుట్టకు రక్షణ మరింత పెరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చింది చిలకలగుట్ట చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు గుట్ట ముందు భాగంలో కొంత వరకు మాత్రమే ప్రహారి నిర్మించారు. పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో కొంత మంది వ్యక్తులు పక్క దారి నుంచి పాదరక్షలతో గుట్ట వద్దకు వెళ్లడంతో అపపవిత్రకు కలుగుతుందని పూజారులు భావిస్తున్నారు. చిలకలగుట్ట వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాలా ఉంటూ భక్తులను, ఇతరులను లోపలికి వెళ్లకుండా రక్షకుడు చూస్తున్నారు. భక్తులు సహకరించాలని పూజారులు కోరుతున్నారు. -
నువ్వు చండాలంగా ఉన్నావ్
వాషింగ్టన్: విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరలవుతోంది. విమానాశ్రయ మహిళా సిబ్బంది ఒకరు ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించింది. ‘నువ్వు చాలా చండాలంగా ఉన్నావ్’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. సదరు ఉద్యోగి ఇలా ఎందుకు చేసిందనే దాని గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ సంఘటన ఈ ఏడాది జూన్‌లో చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని గ్రేటర్ రోచెస్టర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. స్ట్రాస్‌నర్ అనే ప్రయాణికుడు మెటల్ డిటెక్టర్‌లోంచి వెళ్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా సిబ్బంది అతడి చేతికి ఓ చీటి ఇచ్చింది. అయితే స్ట్రాస్‌నర్ దీని గురించి పట్టించుకోకుండా బయటకు వెళ్లాడు. దాంతో సదరు మహిళ మీకిచ్చిన చీటిని చదివారా అని ప్రశ్నించింది. దాంతో స్ట్రాసనర్ దాన్ని తెరిచి చూడగా అందులో ‘నీవు చండాలంగా ఉన్నావ్’ అని రాసి ఉంది. ఆమె చర్యలకు బిత్తరపోవడం స్ట్రాస్‌నర్ వంతవ్వగా సదరు ఉద్యోగి మాత్రం ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించింది. ఉద్యోగి చర్యలతో ఆగ్రహించిన స్ట్రాస్‌నర్ ఆమె మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాక ఆనాటి సంఘటనకు సంబంధించిన వీడియోను సంపాదించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఆమె ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని అని తెలపడమే కాక ఇలాంటి చర్యలను సహించమని.. సదరు ఉద్యోగినిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. -
పోకిరీని వారించినందుకు సీఎం కమాండో హతం
చండీగఢ్ : మహిళను వేధిస్తున్న వ్యక్తిని వారించాడనే ఆగ్రహంతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సెక్యూరిటీ కమాండోను ఓ యువకుడు కాల్చిచంపిన ఘటన మొహాలీలో వెలుగుచూసింది. క్లబ్లో మహిళను అసభ్యంగా తాకుతూ వెకిలిచేష్టలకు పాల్పడిన నిందితుడు చరణ్‌జిత్ సింగ్‌ను పంజాబ్ పోలీస్ 4వ కమాండో బెటాలియన్‌కు చెందిన సుఖ్వీందర్ కుమార్ వారించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో నిందితుడు చరణ్‌జిత్ సింగ్‌తో పాటు అతని స్నేహితులను నిర్వాహకులు బయటకు పంపారు. అదే సమయంలో సుఖ్వీందర్ కూడా వెలుపలికి రావడంతో అక్కడే మాటువేసిన నిందితుడు మరోసారి బాధితుడితో ఘర్షణకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో చరణ్‌జిత్ బాధితుడిపై తన గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. బుల్లెట్ గాయాలతో సుఖ్వీందర్ మరణించారు. కాగా నిందితుడిని గుర్తించామని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మొహాలీ ఎస్ఎస్పీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు. హత్య జరిగిన పార్కింగ్ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని చెప్పారు. -
సెక్యూరిటీ గార్డులే డాక్టర్లు!
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్య సేవలను సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు అందిస్తున్నారు. సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించింది. రెండేళ్ల క్రితం ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడంతో ఇక్కడ రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్దాసుపత్రి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే రోగులకు సెలైన్లు అమర్చుతూ, ఇంజెక్షన్లు వేస్తున్న దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇక్కడ కాన్పు అయిన తర్వాత ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగ పిల్లాడు పుడితే మరో రేటు చొప్పున ఆసుపత్రి సిబ్బంది వసూళ్లు కూడా చేస్తుండడం గమనార్హం. ఈ విషయం తెలిసినా వైద్య అధికారులు ఏమీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
అతడు.. డైమండ్ బ్రాస్లెట్ తిరిగిచ్చేశాడు
చండీగఢ్ : చిన్న వస్తువు పోతేనే తిరిగి చేతికి రాని రోజుల్లో ఏకంగా లక్షలు విలువ చేసే డైమండ్ బ్రాస్లెట్ను తిరిగి సొంతదారుకు అప్పగించిన సెక్యూరిటీ గార్డు ఉదంతం వెలుగు చూసింది. చండీగఢ్‌లోని సెక్టార్ 17లో సినీపొలిస్‌లో సినిమా చూసేందుకు వచ్చిన మీనాక్షి గుప్తా తన భర్త పెళ్లిరోజు కానుకగా తనకు ఇచ్చిన డైమండ్ బ్రాస్లెట్ను పోగొట్టుకున్నారు. ఈ బ్రాస్లెట్ సెక్యూరిటీ గార్డు చేతికి చిక్కినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన అతనికి ఎంతమాత్రం కలగకపోవడంతో పాటు అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతనే లక్షల ఖరీదు చేసే ఆభరణాన్ని ఆమెకు అప్పగించాడు. డైమండ్ బ్రాస్‌లెట్‌పై ఆశలు వదులుకున్నాకే తాను థియేటర్‌కు తిరిగి వచ్చి సెక్యూరిటీ గార్డును అడిగానని, ఆశ్చర్యంగా దాన్ని అతను తనకు తిరిగి ఇచ్చేశాడని మీనాక్షి గుప్తా చెప్పుకొచ్చారు. గత ఏడు నెలలుగా మూవీ హాల్లో పనిచేస్తున్న సూరజ్ నిజాయితీగా తనకు దొరికిన విలువైన వస్తువును తన జేబులో వేసుకోకుండా తిరిగి సొంతదారుకు అప్పగించడం అందరినీ ఆకట్టుకుంది. మీనాక్షి గుప్తాకు వస్తువును తిరిగి ఇచ్చే ముందు ఫోటోలు, బిల్లు, ఆమె ఆధార్ కార్డు సహా అన్ని వివరాలనూ పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే వస్తువును తిరిగివ్వడం గమనార్హం. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆనందం ఉంటుందని, ఇతర మార్గాల్లో సమకూరిన సొమ్ము ఎప్పుడైనా చేజారుతుందని చెబుతున్న సెక్యూరిటీ గార్డు నిజాయితీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
వేతనం రూ.400 జరిమానా..రూ.500
సోమాజిగూడ: నిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ కాంట్రాక్టు విషయంలో యాజమాన్యం వింత నిబంధనను అమలు చేస్తోంది.రెండేళ్లకోసారి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు నిమ్స్ యాజమాన్యం ప్రవేట్ ఏజన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆయా టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన వ్యక్తులకు కాంట్రాక్టు అప్పగిస్తారు. అంతవరకు బాగానే ఉన్నా అక్కడినుంచే అసలు కథ మొదలవుతోంది. నిమ్స్ యాజమాన్యం నుంచి సెక్యూరిటీ కాంట్రాక్టు పొందిన వ్యక్తి నుంచి రోజుకు 150 మంది గార్డులను మూడు షిప్టుల్లో ఆసుపత్రిలో డ్యూటీలో ఉంచాలని నిబంధన ఉంది. అయితే గార్డుల సరఫరాకు అనుమతి పొందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అక్కడినుంచే కష్టాలు ప్రారంభవుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో గార్డులు విధులకు హాజరు కాలేకపోతే నిమ్స్ యాజమాన్యం ఎందరు గార్డులు విధులకు గైర్హాజరైతే అంత మందికి..రూ.500 చొప్పున ఫైన్ విధిస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టు వదులుకోలేక నిమ్స్ యాజమాన్యం విధించి షరతులను అంగీకరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతులెత్తేసిన పాత కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు నిమ్స్ ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సాయిరాయ్ సెక్యూరిటీ ఏజన్సీ యాజమాన్యం నుంచి కాంట్రాక్టు పొందింది. ఏడాది పాటు గార్డుల సరఫరా చేసిన సదరు ఏజన్సీ ..నిమ్స్ పెద్దలతో నెలకొన్న వివాదం కారణంగా 2018 అక్టోబర్‌లో కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంది. నిమ్స్ యాజమాన్యం సకాలంలో గార్డుల సరఫరాకు సంబందించి బిల్లులను మంజూరు చేయకపోవడం..గార్డుల గైర్హాజరుకు విధించే ఫైన్లను తట్టుకోలేక వారు చేతులెత్తేశారు. ఒక్కో గార్డుకు రోజుకు అక్షరాల రూ.400 వేతనంగా చెల్లిస్తుండగా, జరిమానాగా రూ.500 వందలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఫైన్లు చెల్లించలేక సదరు ఏజెన్సీ తప్పుకోవడంతో...టెండర్ల సమయంలో రెండో స్థానంలో ఉన్న ఏషియన్ సెక్యూరిటీ ఏజెన్సీకి నామినేషన్ పద్దతిలో సెక్యూరిటీ గార్డుల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబర్‌లో కాంట్రాక్ట్ తీసుకున్న ఏషియన్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేయలేదు. ఈ విషయమై యాజమాన్యాన్ని గట్టిగా అడిగితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్ సక్రమంగా చెల్లించడం లేదు సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సంబంధించి బిల్లుల విషయమై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌ను వివరణ కోరగా...సదరు ఏజెన్సీ గార్డులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ సక్రమంగా చెల్లించడం లేదన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు.– డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ -
రాష్ట్రపతి రక్షణగా మూడు కులాల వారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి అంగరక్షకుల (సెక్యూరిటీ సిబ్బంది) నియామక ప్రక్రియ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ వివాదంగా మారింది. రాష్ట్రపతి సిబ్బంది నియామకం కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దానిలో రాజ్‌పుత్, సిక్కు, జాట్ కులాల వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీనిపై హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేశారు. బుధవారం దీనిపై విచారించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్‌ను ఆదేశించింది. దేశాధ్యక్షుడుకి సంబంధించిన సిబ్బందిని కులాల వారిగా నియమించడం ఏంటని పిటిషన్‌దారుడు వ్యాజ్యంలో పేర్కొన్నారు. అంగరక్షకుడిగా తాను అన్ని విధాలా అర్హుడినని, తాను యాదవ కులానికి చెందిన వాడినని తన దరఖాస్తును తిరస్కరించారని గౌరవ్ తెలిపారు. రాష్ట్రపతి అంగరక్షకులుగా కేవలం జాట్, సిక్కు, రాజ్‌పుత్‌లనే నియమించడం ఏంటని పిటిషనర్ తరుఫు న్యాయవాది రామ్ నరేష్ యాదవ్ ధర్మాసనం ముందు వాదించారు.