అత్యాచార కేసులోని నిందితుడు అరెస్టును తప్పించుకునే క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దూసుకెళ్లాడు. దీంతో సదరు సెక్యూరిటీ గార్డుకి తీవ్ర గాయలపాలయ్యాడు. ఈ ఘటన నోయిడాలోని అమ్రపాలీ జోడియాక్ సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....నీరజ్ సింగ్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు సింగ్‌పై కేసు నమోదైంది.
ఆ కేసు విషయమై పోలీసులు అతన్న అరెస్టు చేసేందుకు పలుమార్లు అపార్ట్‌మెంట్ సోసైటికీ వచ్చినా... సింగ్ కనిపించకుండా తప్పించుకుని తిరగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు సింగ్ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారం అందడంతో సదరు సోసైటికి వచ్చారు పోలీసులు. దీన్ని పసిగట్టిన సింగ్ తన కారుతో తప్పించుకునేందుకు యత్నించాడు.
దీంతో సింగ్‌ని సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సింగ్ చాలా కర్కశత్వంగా అతనిపై నుంచి కారుని దూసుకెళ్లిపోయాడు. ఇంతలో మరో అధికారి అతని కారుని వెంబడించి సదరు నిందితుడు సింగ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment