న్యూఢిల్లీ: చిన్నపిల్లలు వారి ముద్దు ముద్దు మాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల ముద్దులొలికే మాటలకు అప్పటి వరకు మనకు ఉన్న టెన్షన్‌లు, తనొప్పిలు ఎక్కడివక్కడికే ఎగిరిపోతాయి. పైగా వారి వచ్చిరాని మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాక విస్మయానికి గురిచేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఖతార్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
(చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు)
వివరాల్లోకెళ్లితే.....ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరాధ్య అనే చిన్నపాప తన అత్తకు వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్‌ని కోరుతోంది. ఆ తర్వాత ఆ సెక్యరిటీ గార్డు ఆ చిన్నారి మాటలకు నవ్వుతూ అంగీకారం తెలిపిన వెంటనే తన అత్త దగ్గరకు ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
ఈ సన్నివేశం చూపురులను తల తిప్పుకోనివ్వకుండా ఒక్క క్షణం కట్టిపడేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియోను కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ)
Comments
Please login to add a commentAdd a comment