Little Girl Insists On Temperature Check From Security Guard, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ అంకుల్‌ నన్ను కూడా టెస్ట్‌ చేయండి

Published Fri, Nov 5 2021 3:17 PM | Last Updated on Fri, Nov 5 2021 5:45 PM

A Little Girl Is Insisting On A Temperature Check At The Gate From The Security Guard. Netizens Are Calling Her A Responsible Citizen - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ -19 నుండి రక్షణ కోసం మాస్కలు ధరించడం, ఎ‍ప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లోనూ షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులు, సినిమా హాళ్లు, ఎయిర్‌పోర్ట్‌ తదితర ప్రదేశాల్లో సెక్యూరిటి సిబ్బంది ప్రతి ఒక్కరి శీరీర ఉష్ణోగ్రతలను తనిఖీలు చేస్తున్నారు.

(చదవండి: బంపరాఫర్‌.. ఆ షాపులో ఒక డ్రెస్‌ ఖరీదు రూ.1 మాత్రమే..!)

అయితే ఆ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం వేలాది మందిని తనిఖీలు చేసే సమయంలో జనాల రద్దీ దృష్ట్యా కొంతమందిని తనిఖీ చేయకుండా వదిలేస్తారు. కానీ ఇక్కడొక సెక్యూరిటీ గార్డు అలాగే చేస్తే ఓ చిన్న పాప ఏం చేసిందో తెలుసా?. అంకుల్‌ నాకు కూడా ఉష్ణోగ్రతలను చెక్‌ చేయండి అంటూ రెండు చేతులు చాపుతుంది. దీంతో ఆ సిబ్బంది విస్మయంగా చూడటమే కాక ఆమె శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు.

ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న చిన్న టెడ్డీబేర్‌ బొమ్మకు కూడా చెక్‌ చేయమని అడుగుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోతో పాటు " బాధ్యత గల ప్రతి పౌరుడు ఈ విధంగా ఉండాలి" అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఈ చిన్నపాప యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిందంటూ ఆ పాపను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement