small kid
-
ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: కోవిడ్ -19 నుండి రక్షణ కోసం మాస్కలు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లోనూ షాపింగ్ మాల్స్, ఆఫీసులు, సినిమా హాళ్లు, ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాల్లో సెక్యూరిటి సిబ్బంది ప్రతి ఒక్కరి శీరీర ఉష్ణోగ్రతలను తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) అయితే ఆ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం వేలాది మందిని తనిఖీలు చేసే సమయంలో జనాల రద్దీ దృష్ట్యా కొంతమందిని తనిఖీ చేయకుండా వదిలేస్తారు. కానీ ఇక్కడొక సెక్యూరిటీ గార్డు అలాగే చేస్తే ఓ చిన్న పాప ఏం చేసిందో తెలుసా?. అంకుల్ నాకు కూడా ఉష్ణోగ్రతలను చెక్ చేయండి అంటూ రెండు చేతులు చాపుతుంది. దీంతో ఆ సిబ్బంది విస్మయంగా చూడటమే కాక ఆమె శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న చిన్న టెడ్డీబేర్ బొమ్మకు కూడా చెక్ చేయమని అడుగుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోతో పాటు " బాధ్యత గల ప్రతి పౌరుడు ఈ విధంగా ఉండాలి" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ చిన్నపాప యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిందంటూ ఆ పాపను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’) A responsible citizen should be like this. @hvgoenka pic.twitter.com/7phGPk4rfm — Dinesh Joshi (@officeofdnj) November 3, 2021 -
కని పారేశారు..
సాక్షి, వికారబాద్ : ముక్కుపచ్చలారని ఓ పసికందు (అప్పుడే పుట్టిన పాప)ను గుర్తుతెలియని వారు ముళ్లపొదల్లో పడేశారు. దీంతో ఓ కుక్క ఆ పసికందును పట్టుకెళ్తుండగా ఓ రైతు గమనించి పాపను కాపాడాడు. అనంతరం పాపను మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబు అనే రైతు శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. దారిలోని పొదల్లో పడి ఉన్న పసికందును కుక్క తన నోటితో పట్టుకుని వెళ్తుండగా గుర్తించాడు. వెంటనే కుక్కను వెళ్లగొట్టి పాపను రక్షించాడు. తర్వాత పాపను మర్పల్లిలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వైద్యులు పంపించారు. -
చిన్ని చిన్ని ఆశ
ఫారిన్లో పాటలు పాడుకుంటున్నారు నయనతార, శివ కార్తికేయన్. అక్కడికి వచ్చిన ఓ చిన్నారి నయనతారను అలాగే చూస్తూ ఉండిపోయిందట. విషయం ఏంటని యూనిట్ సభ్యులు ఆ చిన్నారిని అడిగితే.. నయన్‌తో ఫొటో కావాలని ముద్దు ముద్దుగా అడిగిందట. ఆ చిన్నారి చిన్ని చిన్ని ఆశకు ముచ్చటపడిపోయి ఫొటోకు పోజు ఇచ్చారు నయనతార. ఆ వెంటనే హీరో శివ కార్తికేయన్ కూడా ఓ ఫొటో ఫ్రేమ్‌లో బందీ అయిపోయారు. ఎమ్. రాజేశ్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, నయనతార జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అజర్ౖబైజాన్లో జరుగుతోంది. పాటలతో పాటు కొన్ని కీలక సీన్స్‌ను కూడా ప్లాన్ చేసింది చిత్రబృందం. పైన చెప్పిందంతా ఈ షూటింగ్ లొకేషన్లోనే జరిగింది. -
ఆదర్శంగా నిలిచినరెండేళ్ల బుడతడు
-
లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన బుడతడు
చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ.. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని ముగించుకునే వారేందరో. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రెండేళ్ల బుడతడు. నడవడమే అసాధ్యమన్న డాక్టర్లు ఇప్పుడు ఆ చిన్నారి అడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బుడిబుడి అడుగులే ఇప్పుడతన్ని ఇంటర్నెట్ స్టార్‌గా మార్చాయి. పెంపుడు కుక్కతో పాటు అడుగులేస్తున్న రోమన్ డింకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ చిట్టి అడుగులే ఇప్పుడు జీవితం మీద ఆశలు కోల్పోయిన ఎందరికో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి . రోమన్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ‘గర్భంలో ఉన్నప్పుడే రోమన్‌కి వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. అయినా పిండం ఎదుగుదలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలగలేదు. రోమన్ జన్మించిన తరువాత అతను నడవడం అసాధ్యమన్నారు డాక్టర్లు. కానీ మేము మాత్రం మా బిడ్డ చేత నడిపించాలనుకున్నాము. అందుకు ఎన్నో ఆస్పత్రులకు తిరిగాము. ఒక 4 నెలల క్రితమే రోమన్‌కి అల్ట్రా సౌండ్ చికిత్స చేయించాము. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత రోమన్ చేత నడక ప్రయత్నాలు చేయించేవాళ్లం. కానీ కొద్ది దూరం నడవగానే పడిపోయేవాడు. దాంతో నేను లేదా నా భర్త పక్కనే ఉండి తనను పట్టుకొని నడిపించే ప్రయత్నం చేసేవాళ్లం. అలాంటిది ఉన్నట్టుండి ఒక రోజు చాలా ఆశ్యర్యకరమైన సంఘటన జరిగింది. మా ఇంట్లో మాగీ అనే పెంపుడు కుక్క ఉండేది. అదంటే రోమన్‌కి చాలా ఇష్టం. ఆ రోజు మాగీ రోమన్ ముందుకు రాగానే వాడు సంతోషం పట్టలేకపోయాడు. దాన్ని చూస్తూ ఆ సంతోషంలో దానితో పాటు నడవడం ప్రారంభించాడు. రోమన్ నడవడం చూసి నాకు కన్నీరు ఆగలేదు. నా సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని అనుకున్నాను. అందుకే ఈ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాను. కానీ ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. వారందరు మా రోమన్‌ను పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. -
వయస్సు 14..ప్రాణాలు 70
ఈ చిత్రంలో చేతులు కట్టుకుని నిల్చున్న పిల్లాడి వయస్సు 14. వచ్చీరాని డ్రైవింగ్‌తో 70 మంది విద్యార్థులను ట్రాక్టర్లో వజ్రకరూరు సమీపంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు తీసుకెళ్తున్నాడు. ఇతడిని ఆ పనికి పురమాయించింది ఎవరో కాదు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. అందరికీ మంచీచెడు బోధించే వీరు.. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణానికి పురమాయించారు. మంగళవారం ఉదయం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి ప్రభుత్వ పాఠశాలలో 4, 5, 6వ తరగతి విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి ఎర్రిస్వామి, మరో ముగ్గురు ఉపాధ్యాయులు 12 కిలోమీటర్ల దూరంలోని వజ్రాల అన్వేషణ క్యాంప్ పరిశీలనకు ట్రాక్టర్లో తీసుకెళ్లారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీఐ చిన్నగౌస్ వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న పిల్లాడిని లైసెన్స్ అడుగగా.. ఇంకా నేర్చుకుంటున్నట్లు సమాధానమిచ్చాడు. దీంతో ఎంఈఓతో పాటు ఇతర ఉపాధ్యాయులకు చివాట్లు పెట్టారు. పిల్లలకు ఏదయినా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం ట్రాక్టర్‌ను సీజ్ చేసి.. విద్యార్థులను ఇతర వాహనాల్లో సురక్షితంగా తరలించారు. -
కాకినాడ ప్రభుత్వాస్పాత్రిలో ఆడ శిశువు మాయం
-
ఏడ్చి ఏడ్చి పసికందు మృతి
బాలానగర్: పేగు బంధం మరచిన కొందరు అప్పుడే పుట్టిన పసిబిడ్డను పొదల్లో పడేసిపోయారు. బాలానగర్ పోలీసుల కథనం ప్రకారం... బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ సమీపంలో గల వాటర్‌ట్యాంక్ దగ్గర పొదల్లో గురువారం పసికందు ఏడుపు వినిపించింది. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి పాప చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్ సీఐ పెండ్యాల భిక్షపతిరావు తెలిపారు.