
ఏడ్చి ఏడ్చి పసికందు మృతి
బాలానగర్: పేగు బంధం మరచిన కొందరు అప్పుడే పుట్టిన పసిబిడ్డను పొదల్లో పడేసిపోయారు. బాలానగర్ పోలీసుల కథనం ప్రకారం... బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ కాలనీ సమీపంలో గల వాటర్‌ట్యాంక్ దగ్గర పొదల్లో గురువారం పసికందు ఏడుపు వినిపించింది. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి పాప చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్ సీఐ పెండ్యాల భిక్షపతిరావు తెలిపారు.