న్న చిన్న సమస్యలకే భయపడుతూ.. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని ముగించుకునే వారేందరో. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రెండేళ్ల బుడతడు. నడవడమే అసాధ్యమన్న డాక్టర్లు ఇప్పుడు ఆ చిన్నారి అడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బుడిబుడి అడుగులే ఇప్పుడతన్ని ఇంటర్నెట్ స్టార్‌గా మార్చాయి. పెంపుడు కుక్కతో పాటు అడుగులేస్తున్న రోమన్ డింకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ చిట్టి అడుగులే ఇప్పుడు జీవితం మీద ఆశలు కోల్పోయిన ఎందరికో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి .