చిన్ని చిన్ని ఆశ | Nayanthara playing with a kid in Azerbaijan is too cute to handle | Sakshi
Sakshi News home page

చిన్ని చిన్ని ఆశ

Published Mon, Dec 17 2018 1:45 AM | Last Updated on Mon, Dec 17 2018 1:45 AM

Nayanthara playing with a kid in Azerbaijan is too cute to handle - Sakshi

ఫారిన్‌లో పాటలు పాడుకుంటున్నారు నయనతార, శివ కార్తికేయన్‌. అక్కడికి వచ్చిన ఓ చిన్నారి నయనతారను అలాగే చూస్తూ ఉండిపోయిందట. విషయం ఏంటని యూనిట్‌ సభ్యులు ఆ చిన్నారిని అడిగితే.. నయన్‌తో ఫొటో కావాలని ముద్దు ముద్దుగా అడిగిందట. ఆ చిన్నారి చిన్ని చిన్ని ఆశకు  ముచ్చటపడిపోయి ఫొటోకు పోజు ఇచ్చారు నయనతార. ఆ వెంటనే హీరో శివ కార్తికేయన్‌ కూడా ఓ ఫొటో ఫ్రేమ్‌లో బందీ అయిపోయారు. ఎమ్‌. రాజేశ్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్, నయనతార జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అజర్‌ౖబైజాన్‌లో జరుగుతోంది. పాటలతో పాటు కొన్ని కీలక సీన్స్‌ను కూడా ప్లాన్‌ చేసింది చిత్రబృందం. పైన చెప్పిందంతా ఈ షూటింగ్‌ లొకేషన్‌లోనే జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement