temprature
-
రికార్డులు బద్ధలు కొడుతున్న ఉష్ణోగ్రతలు
-
ఉత్తరాదిని బెంబేలెత్తిస్తున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
-
మండే ఎండలు..సూర్యుడు బాగా బాగా
-
వేసవి ప్రభావం గురించి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద
-
సమ్మర్ కేర్.. సింపుల్ టిప్స్
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి తీవ్రత
-
ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: కోవిడ్ -19 నుండి రక్షణ కోసం మాస్కలు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లోనూ షాపింగ్ మాల్స్, ఆఫీసులు, సినిమా హాళ్లు, ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాల్లో సెక్యూరిటి సిబ్బంది ప్రతి ఒక్కరి శీరీర ఉష్ణోగ్రతలను తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) అయితే ఆ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం వేలాది మందిని తనిఖీలు చేసే సమయంలో జనాల రద్దీ దృష్ట్యా కొంతమందిని తనిఖీ చేయకుండా వదిలేస్తారు. కానీ ఇక్కడొక సెక్యూరిటీ గార్డు అలాగే చేస్తే ఓ చిన్న పాప ఏం చేసిందో తెలుసా?. అంకుల్ నాకు కూడా ఉష్ణోగ్రతలను చెక్ చేయండి అంటూ రెండు చేతులు చాపుతుంది. దీంతో ఆ సిబ్బంది విస్మయంగా చూడటమే కాక ఆమె శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న చిన్న టెడ్డీబేర్ బొమ్మకు కూడా చెక్ చేయమని అడుగుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోతో పాటు " బాధ్యత గల ప్రతి పౌరుడు ఈ విధంగా ఉండాలి" అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ చిన్నపాప యావత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చిందంటూ ఆ పాపను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’) A responsible citizen should be like this. @hvgoenka pic.twitter.com/7phGPk4rfm — Dinesh Joshi (@officeofdnj) November 3, 2021 -
వేడెక్కుతోంది...
- 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు - చింతూరులో అత్యధికంగా 43 డిగ్రీలు - మరో వారం రోజులు ఇంతే అమలాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అగ్నిగుండంగా మారిపోతోంది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విలీన మండలమైన చింతూరులో శనివారం ఏకంగా 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. రాజమహేంద్రవరం, పచ్చని కోనసీమలో సైతం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కాకినాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తుని, మండపేట వంటి ప్రాంతాల్లో సైతం ఇదే ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం పది గంటల తరువాత బయటకు రావాలంటనే భయపడుతున్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం, వేడి గాలులతో సామాన్యులు అపసోపాలు పడుతున్నారు. ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం. ఈ వారం మరింత తీవ్రత... ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వారం పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఎండతీవ్రత ఎక్కువగ ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడే ఎండతీవ్రతలు ఇలా ఉంటే రోహిణిలో ఎలా తట్టుకునేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.