సాక్షి, మేడారం(వరంగల్) : సమ్మక్కతల్లి కొలువు దీరిన మేడారం చిలకలగుట్టకు ప్రత్యేకత ఉంది. చిలకలగుట్ట అపపవిత్రకు గురికాకుండా ఉండేందుకు మేడారం సమ్మక్క–సారలమ్మ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తల్లిగుట్ట వద్ద ఆదివాసీ యువకుడిని రక్షకుడిగా ఏర్పాటు చేశారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున గుట్టపైన కొలువైన సమ్మక్క తల్లిని పూజారులు కుంకుమ భరిణి రూపంలో అద్భుతమైన ఘట్టం మధ్య గద్దెపైకి తీసుకువస్తారు. పూజారులు తల్లిగుట్ట పవిత్రను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డు ఇతరులు గుట్టలోపలికి వెళ్లకుండా చూస్తున్నారు.
పెరిగిన రక్షణ
పూజారులు నియమించుకున్న సెక్యూరిటీ గార్డుతో తల్లిగుట్టకు రక్షణ మరింత పెరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చింది చిలకలగుట్ట చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు గుట్ట ముందు భాగంలో కొంత వరకు మాత్రమే ప్రహారి నిర్మించారు. పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో కొంత మంది వ్యక్తులు పక్క దారి నుంచి పాదరక్షలతో గుట్ట వద్దకు వెళ్లడంతో అపపవిత్రకు కలుగుతుందని పూజారులు భావిస్తున్నారు. చిలకలగుట్ట వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాలా ఉంటూ భక్తులను, ఇతరులను లోపలికి వెళ్లకుండా రక్షకుడు చూస్తున్నారు. భక్తులు సహకరించాలని పూజారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment