![Security Guard Assasinate Man Critizing Him Not To Drink Liquor Bangalore - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/12/bangalore.jpg.webp?itok=nMWxlAv_)
సెక్యూరిటీ గార్డులు అంటే కేవలం పని మాత్రమే కాదు నలుగురిని కాపాడే బాధ్యత కూడా. అందుకే ఆ ఉద్యోగంలో అప్రమత్తత అనేది చాలా అవసరం లేకపోతే వాళ్ళు పని చేస్తున్న ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని మందు తాగుతూ డ్యూటీ సరిగా చేయని ఓ సెక్యూరిటీ గార్డ్ కి చెప్పినందుకు ఒక వృద్ధుడి గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని ఏరోనాటికల్ ఇంజినీర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలో జరిగింది.
వివరాలు ప్రకారం... భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉన్నాడు. ఆ అపార్ట్‌మెంట్ లోనే సెక్యూరిటీ గార్డుగా ఉన్న బసంత్ అనే వ్యక్తి మందుకొట్టి మత్తులో డ్యూటీ సరిగా చేయడం లేదని గుర్తించాడు భాస్కర్. దీంతో అలా మద్యం సేవించి పని చేయడం సరికాదని హెచ్చరించాడు. ఇదే విషయాన్ని అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్‌లోనూ ప్రస్తావించాడు. ఈ ఘటన తో తన ప్రవర్తన మారకపోగా ఆగ్రహం తెచ్చుకున్న బసంత్.. మరుసటి రోజు వాకింగ్‌కు వెళ్లిన భాస్కర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆపై తన వెంటన తెచ్చుకున్న కత్తితో కిరాతకంగా అతని గొంతు కోసి అకాడి నుంచి పారిపోయాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న భాస్కర్‌ను చూసిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బసంత్‌ను అరెస్ట్ చేశారు.
చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment