
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యశవంతపుర: మిస్డ్‌కాల్‌తో పరిచయమైన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు హత్యకు గురైన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... మాదావరకు చెందిన చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహరకు చెందిన ఓ మహిళ మిస్డ్‌కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారి రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం ఎవరికి తెలియకుండా ఇద్దరు కాపురం పెట్టారు.
విషయం తెల్సిన యువతి భర్త భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంత జరిగినా ఆమె ప్రియుడితో స్నేహం కొనసాగించేది. తిరిగి ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య ప్రియుడితో వెళ్లిపోవటాన్ని భర్త జీరి్ణంచుకోలేకపోయాడు. చంద్రశేఖర్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భర్త, మహిళ బంధువులు చంద్రశేఖర్‌ను తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ చికిత్స పొందుతూ గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: దెయ్యం విడిపిస్తానని లైంగికదాడి
Comments
Please login to add a commentAdd a comment