racist
-
‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి
న్యూఢిల్లీ: పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ‘‘నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చా. నేను భారతీయురాలిగా కనిపిస్తా. నా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు సైతం సభ్యులుగా ఉన్నారు. వారంతా భారతీయులుగానే కనిపిస్తారు. నా సహచరులైన పశి్చమ ప్రాంతాల ప్రజలు కూడా భారతీయులుగానే కనిపిస్తారు. రాహుల్ గాం«దీకి గురువైన ఓ జాత్యహంకారికి మాత్రం భారతీయులు ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అసలు రంగు బయటపడింది. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. విపక్ష ‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి’’ అని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో పిట్రోడాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పిట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రజలను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని, దీని వెనుక శామ్ పిట్రోడా సలహాలు ఉంటాయని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. దురదృష్టకరం: జైరామ్ రమేశ్ శామ్ పిట్రోడా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. ఇండియాలోని వైవిధ్యాన్ని వరి్ణస్తూ పిట్రోడా ప్రస్తావించిన పోలికలు దురదృష్టకరమని పేర్కొన్నారు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు. పిట్రోడా అభిప్రాయాలతో తమ పారీ్టకి ఎలాంటి సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ
woman screaming a racist slur outside a pub in the UK: డ్రింక్ చేసేవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో మనం చూసే ఉంటాం. అయితే కొంతమంది బాగా తాగితే వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడటమే కాక చాలా దారుణంగా దూషిస్తారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తనను పబ్‌లోకి వెళ్లనివ్వు అంటూ సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది. (చదవండి: రష్యా బస్సు ప్రమాదంలో ఐదుగురు మృతి) అసలు విషయంలోకెళ్లితే....యూకేకి చెందిన నటాషా విలియమ్స్ అనే 24 ఏళ్ల మోడల్ పబ్‌లోకి మళ్లీ ప్రవేసించకుండా అడ్డుకుంటున్నాడని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో గొడవపడింది. పైగా తన బ్యాగ్ పోయిందని అందువల్లే మళ్లా పబ్‌కి వచ్చాను నన్ను వెళ్లనివ్వు అంటూ అతని పై గట్టిగా అరిచింది. ఈ మేరకు సెక్యూరిటీ గార్డు చాలా రాత్రి అవ్వడం వల్ల మూసివేసే నిమిత్తం ఆమెను అనుమతించాడు. దీంతో ఆమె జాత్యహంకర దూషణలుకు పాల్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కొందరు తాగిన మైకంలో మాట్లాడిందని సమర్ధిస్తే, మరికొందరు జాతివిద్వేషాలను తెరలేపినందుకుగానూ విలియమ్స్‌ని ఘూటుగా విలియమ్స్‌ని విమర్శించారు. అయితే ఈ సంఘటన తర్వాత ఆమె తల్లి తన కూతురు జాత్యహంకార దూషణలను ఉపయోగించినందుకు అతనికి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. (చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే) View this post on Instagram A post shared by @imjustleam -
హాఫ్ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణ గుత్తా జ్వాల తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్డౌన్ సక్రమంగా పాటించని అలాంటి వారే కరోనా వైరస్ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్ కరోనా’ అని కొందరు అనడం జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో తనను హాఫ్ కరోనా అని పేర్కొనడం, గతంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలపై జాత్యహంకార దాడులు జరగడం వంటి విషయాలపై ఆమె స్పందించారు. ‘నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాను. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేశారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో నేను వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్ చేశా. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్ కరోనా, చైనాకా మాల్, హాఫ్ చైనీస్, చింకీ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా. లాక్డౌన్లో ఉదయం లేవగానే చూస్తే మన(హైదరాబాద్) రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే వారే కరోనా వైరస్ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సినిమాలు, షోస్ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి’ అని గుత్తా జ్వాల పేర్కొన్నారు. ఇక మహమ్మారి కరోనా వైరస్ చైనాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. ఈ మహమ్మారితో ప్రపంచదేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో ఉండగా.. అనేక వేల మంది మృత్యువాతపడ్డారు. దీంతో చైనా, ఆ దేశ ప్రజలపై సోషల్ మీడియావేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం చైనా వైరస్ అని పేర్కొని ఆ ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాడు. దీంతో అన్ని దేశాల ప్రజలకు చైనాపై ఓ రకమైన వివక్ష ఏర్పడింది. View this post on Instagram Meanwhile..... Doing something productive #helpingmommy #lockdown2020 A post shared by Jwala Gutta (@jwalagutta1) on Apr 5, 2020 at 10:27am PDT చదవండి: లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు -
‘నీ చదువు నీకిదే నేర్పిందా?’
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యంహకారి అంటూ నెటిజన్లు సారాపై మండిపడుతున్నారు. సారా పోస్ట్ చేసిన ఓ మ్యాగ్జైన్ కవర్ ఫోటో ఈ విమర్శలకు కారణం అయ్యింది. వివరాలు.. సారా తొలిసారి ‘ఫిల్మ్‌ఫేర్’ అనే మ్యాగ్జైన్ కవర్ పేజీ మీద కనిపించింది. ఈ ఫోటో షూట్లో భాగంగా సారా ఓ మసాయి తెగ వ్యక్తితో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ చదువు నీకిదే నేర్పిందా. ఇతరులు మన సంస్కృతిని గౌరవించాలని ఎలా భావిస్తామో.. అలానే మనం కూడా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని తెలీదా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ‘పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను, వారి సంస్కృతులను కించపర్చడం మంచిది కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలతో జనాలకు విసుగు తెప్పించకు. నీ ఫోటోలు జాత్యంహకారానికి నిదర్శనంగా నిలిచాయం’టూ మండిపడుతున్నారు. -
గాంధీజీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ
లిలాంగ్వే, మలావి : తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి వాణిజ్య రాజధాని కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 10 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ నిర్మిస్తోంది. గాంధీజీ.. తన జీవితంలో ఎక్కువ కాలం జాత్యహంకారాన్ని ప్రదర్శించడానికే వెచ్చించారని, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాజధానిలో నిర్మించడం సబబు కాదని..‘ గాంధీ మస్ట్ ఫాల్’ గ్రూప్ సభ్యులు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా.. ‘నల్లజాతీయులైన తమకు గాంధీ వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు సరికదా, ఆ భావన మాలో మరింత బలంగా నాటుకుపోయింది’ అంటూ మరో పద్దెనిమిది అభ్యంతరాలతో కూడిన లేఖను కోర్టుకు అందజేశారు. సుమారు 3 వేల మంది మలావియన్స్ సంతకం చేసిన ఈ లేఖను, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆఫ్రికా దేశాల్లో గాంధీ విగ్రహ నిర్మాణానికి నిరసన సెగ తగలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2016లో ఘనాలోని ఓ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఘనా ప్రభుత్వం ప్రయత్నించగా.. గాంధీజీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరో చోట విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించింది. శాంతి, అహింసా మార్గాలతో భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసేందుకు తన జీవితాన్ని ధారపోసిన గాంధీజీ.. తొలి ఉద్యమం దక్షిణాఫ్రికాలో మొదలైందన్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశాల్లోని కొంతమంది ప్రజలు మాత్రం ఆయనను ఓ జాత్యహంకారిగా, తమ మధ్య విభేదాలు సృష్టించిన వ్యక్తిగా ద్వేషిస్తూ ఉంటారు. -
నా ఇష్టంతోనే చేశాను..!
న్యూఢిల్లీ : ’డవ్‘ సోప్ తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఈ యాడ్ జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మరికొందరైతే.. దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ యాడ్‌లో నటించి బ్రిటీష్ - నైజీరియన్ మొడల్ లోలా ఒగ్నోమీ స్పందించారు. నేను ఇష్టపడే ఆ అడ్వర్టయిజ్మెంట్లో నటించాను.. నేను బాధితురాలిని కాను.. నేను మానసికంగా చాలా బలంగాను.. అందంగానూ ఉంటాను అని ఆమె ప్రకటించారు. ఈ యాడ్ అనేది కేవలం సంస్థ సృజనాత్మకదృష్టికి ప్రతీక మాత్రమే అని చెప్పారు. దీనిపై ఎవరూ రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. యాడ్‌లో ఏముంది? అంతర్జాతీయంగా జాతి వివక్షకు దారితీసేలా అడ్వర్టయిజ్మెంట్ ఉందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంతకూ యాడ్‌లో ఏముందన్న ఆసక్తి సర్వత్రా పెరిగింది. ఈ యాడ్ ఆరంభంలో ఒక నల్లటి అమ్మాయి.. డవ్ సోప్ వాడకముందు.. ఇలా ఉంది... వాడుతున్నాక.. ఇలా అంటూ.. నల్లటి అమ్మాయి టీ షీర్ట్ తీయగానే తెల్లగా మారుతుంది. నెటిజన్ల ఆగ్రహం డవ్ తాజాగా రూపొందించిన అడ్వర్టయిజ్మెంట్ పూర్తిగా జాతి, వర్ణ వివక్షను పెంచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. డవ్ సంస్థపై తమ ఆగ్రహాన్ని ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తున్నారు. ఇటువంటి అడ్వర్టయిజ్మెంట్లను నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Let's be clear, Dove knew exactly what they were doing with their racist ad. Soap companies used to do this racist theme all the time pic.twitter.com/EzvAiExNcP — Tariq Nasheed (@tariqnasheed) October 8, 2017 Dove Ran a Disturbingly Racist Ad—and It Isn’t the First Time https://t.co/UUm6BDIpt0 *walks into bathroom and throws out bar of dove soap* — Anna Paquin (@AnnaPaquin) October 9, 2017 -
డ్రస్ బాగోలేదని డైనింగ్ టేబుల్ ఇవ్వనన్నారట!
కోల్కత్తా : డ్రస్ మంచిగా వేసుకురాలేదట. డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ఇవ్వనంటోంది ఓ రెస్టారెంట్. మళ్లీ ఆ రెస్టారెంట్‌కు ఎంత పేరు ఉందో తెలుసా.? కోల్ కత్తాలోని పార్క్ స్ట్రీట్‌లో ఆ రెస్టారెంట్ తెలియని వాళ్లుండరు. 60 ఏళ్లుగా సర్వీసులను అందిస్తూ ఐకానిక్‌గా నిలుస్తున్న మోకాంబో రెస్టారెంట్ ప్రస్తుతం జాత్యంహకారం ఆరోపణలతో పాటు పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రెస్టారెంట్ చేసిన నిర్వాకంపై ఫేస్బుక్లో ఓ కస్టమర్ పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో రెస్టారెంట్‌కు వ్యతిరేకంగా నమోదైన ఈ పోస్టుపై 10వేలకు పైగా రియాక్షన్స్, 16వేల షేర్లు, 3వేల కామెంట్లు వెల్లువెత్తుతూ వైరల్ సృష్టిస్తున్నాయి. దిల్షాన్ హేమ్నాని అనే మహిళ కోల్కత్తా నగరానికి విజిటర్‌గా వచ్చింది. వారం రోజులుగా అవసరార్థం నియమించుకున్న తను, డ్రైవర్ మనీష్ డిన్నర్ కోసం మోకాంబో రెస్టారెంట్‌కు వెళ్లారు. డిన్నర్ టేబుల్ కోసం క్యూలో వేచిఉన్న వీరిని రెస్టారెంట్ స్టాఫ్ అసలు పట్టించుకోలేదు. దీంతో తమకెందుకు టేబుల్ సౌకర్యం కల్పించడం ప్రశ్నించగా సాకులు చెప్పడం మొదలు పెట్టారు రెస్టారెంట్ స్టాఫ్. డ్రైవర్ సరియైన బట్టలు వేసుకోలేదని కొందరు, అతను తాగి ఉన్నాడని మరికొందరు స్టాఫ్ ఆమెతో వాదించారట. జాత్యాంహకార భావనతో రెస్టారెంట్ స్టాఫ్ ఈ మాదిరి వ్యవహరిస్తున్నారని గుర్తించిన హేమ్నాని, రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ కొథారిని కాంటాక్టు చేసింది. అయితే తను కూడా ఇదే మాదిరి సమాధానమిచ్చాడు. డ్రైవర్ ధరించిన దుస్తులు బాగాలేవని, ఒకవేళ గెస్టులు శుభ్రంగా లేకపోతే, ఇతర కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తాయంటూ సాకులు చెప్పాడట. రెస్టారెంట్ నిర్వర్తించిన ఈ అమానుష చర్యపై హేమ్నాని ఫేస్బుక్లో వివరిస్తూ ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై స్పందించిన కస్టమర్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఒకవేళ తాను డర్టీగా రెస్టారెంట్‌కు వెళ్తే, అలానే బయటికి పంపిస్తారా అంటూ సుదీప్తో రాయ్ అనే వ్యాపారవేత్త ప్రశ్నించారు. బాయ్‌కాట్ మోకాంబో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది కస్టమర్లు రెస్టారెంట్‌కు మద్దతు పలుకుతున్నారట. ప్రస్తుతం ఈ పోస్టు ఫేస్బుక్లో వైరల్ సృష్టిస్తోంది. -
'మోనిక... అయామ్ సారీ'
-
'మోనిక... అయామ్ సారీ'
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన అవమానానికి మణిపురి యువతి మోనికా కంగెంబంకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ క్షమాపణ చెప్పారు. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు తన పరిధిలోకి లేవని వెల్లడించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరతానని అన్నారు. మోనికా కంగెంబంకు జరిగిన అవమానంపై సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ ఉద్యోగి తన పట్ల జాత్యాంహకారం ప్రదర్శించాడు. తాను ఎదుర్కొన్న జాతి వివక్షను వివరిస్తూ ఫేస్బుక్ లో ఒక లేఖను ఆమె పోస్ట్ చేసింది. 'నువ్వు నిజంగా భారతీయురాలివేనా' అంటూ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారి జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది. మోనికకు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు. Monika Khangembam - I am sorry to know this. Immigration is not with me./1 — Sushma Swaraj (@SushmaSwaraj) 10 July 2016 I will speak to my senior colleague Shri @rajnathsingh ji to sensitise Immigration officials at the airport./2 — Sushma Swaraj (@SushmaSwaraj) 10 July 2016 -
సోషల్ మీడియాలో వ్యాఖ్యలు:దక్షిణాఫ్రికాలో దుమారం..
ఆమె వ్యాఖ్యలు జాత్యాహంకారాన్ని, జాతి వివక్షను ప్రతిబింబించాయి. జాతి వాదాన్ని రెచ్చగొట్టాయి. 'బ్లాక్ పీపుల్ యాజ్ మంకీస్' అంటూ సామాజిక మాధ్యమంలో తీవ్ర పదజాలాన్ని వాడి.. దక్షిణాఫ్రికా ఎస్టేట్ ఏజెంట్.. ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటోంది. డర్బన్ బీచ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె నల్లజాతీయులను విమర్శిస్తూ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ డెమొక్రెటిక్ అలయెన్స్ 'పెన్నీ స్పారో' సభ్యత్వాన్ని రద్దుచేయడమే కాక, ఆమెపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. జాతి వివక్షను రేపిన స్పారో వ్యాఖ్యలపై డెమొక్రెటిక్ అలయెన్స్ పార్టీ ప్రతినిధి రిఫైలియో నెట్ సేఖే స్పందించారు. స్పారో ప్రవర్తనపై ఫెడరల్ లీగల్ కమిషన్ కు సూచిస్తామని... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. డెమొక్రెటిక్ పార్టీలోనూ, ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా సమాజంలోనూ జాత్యాహంకారులకు ప్రవేశం లేదని ఆమె చెప్పారు. సౌతాఫ్రికాలో ఇటువంటి వైఖరి కలిగిన వారికి చోటు ఉండదని, దక్షిణాఫ్రికా నల్లజాతీయుల గౌరవాన్ని కించపరచినవారికి శిక్ష తప్పదన్నారు. సౌతాఫ్రికా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడ అభియోగాలపై విచారణ చేపడుతున్నామని, అనంతరం ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. డర్బన్ ప్రజలపై సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే స్పారో ప్రజాద్వేషిగా మారిపోయింది. ''కొత్త సంవత్సరం వేడుకల సమయంలో బీచ్ లోకి ఈ కోతులను, చదువుకోని వారిని అనుమతించడంతో చెత్త పేరుకోవడమే కాక, ఇతరులకు సమస్యలు కూడా ఎదురౌతాయి'' అంటూ స్పారో పోస్ట్ చేయడం దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న జాతి వివక్షను ఎత్తి చూపింది. అయితే పెన్నీస్పారో వ్యాఖ్యలపై దుమారం లేవడంతో ఆమె స్పందించింది. తాను నల్ల జాతీయులను విమర్శించ లేదని, తనకు వారంటే ఎంతో గౌరవమని సర్ది చెప్పింది. వారు అద్భుతమైన తెలివితేటలు గలవారని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దంటూ క్షమాపణలు కోరింది. కాగా స్పారో వ్యాఖల నేరంతో 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష దుమారం చెలరేగింది. 'హ్యాష్ ట్యాగ్' లో వేలమంది స్పారోపై దూషణల పర్వం కొనసాగించారు. ఆమె ఓ హేట్ ఫిగర్ అంటూ అభివర్ణించారు. డిసెంబర్ లో జాతిసంబంధాల సయోధ్యపై నిర్వహించిన ఓ సర్వే కూడా.. వర్ణ విచక్షణలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు తేల్చి చెప్పింది. అయితే స్పారో వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికాలో చెలరేగిన ఈ జాతి వివక్ష రగడ.. ఎటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందోనని అంతా ఆందోళనలో ఉన్నారు.