
'మోనిక... అయామ్ సారీ'
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన అవమానానికి మణిపురి యువతి మోనికా కంగెంబంకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ క్షమాపణ చెప్పారు. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు తన పరిధిలోకి లేవని వెల్లడించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరతానని అన్నారు. మోనికా కంగెంబంకు జరిగిన అవమానంపై సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ ఉద్యోగి తన పట్ల జాత్యాంహకారం ప్రదర్శించాడు. తాను ఎదుర్కొన్న జాతి వివక్షను వివరిస్తూ ఫేస్బుక్ లో ఒక లేఖను ఆమె పోస్ట్ చేసింది. 'నువ్వు నిజంగా భారతీయురాలివేనా' అంటూ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారి జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడని వెల్లడించింది. మోనికకు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు.
Monika Khangembam - I am sorry to know this. Immigration is not with me./1
— Sushma Swaraj (@SushmaSwaraj) 10 July 2016
I will speak to my senior colleague Shri @rajnathsingh ji to sensitise Immigration officials at the airport./2
— Sushma Swaraj (@SushmaSwaraj) 10 July 2016