నిర్మల ధ్వజం
న్యూఢిల్లీ: పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ‘‘నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చా. నేను భారతీయురాలిగా కనిపిస్తా. నా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు సైతం సభ్యులుగా ఉన్నారు. వారంతా భారతీయులుగానే కనిపిస్తారు. నా సహచరులైన పశి్చమ ప్రాంతాల ప్రజలు కూడా భారతీయులుగానే కనిపిస్తారు.
రాహుల్ గాం«దీకి గురువైన ఓ జాత్యహంకారికి మాత్రం భారతీయులు ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అసలు రంగు బయటపడింది. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. విపక్ష ‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి’’ అని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో పిట్రోడాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పిట్రోడాను ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రజలను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని, దీని వెనుక శామ్ పిట్రోడా సలహాలు ఉంటాయని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
దురదృష్టకరం: జైరామ్ రమేశ్
శామ్ పిట్రోడా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. ఇండియాలోని వైవిధ్యాన్ని వరి్ణస్తూ పిట్రోడా ప్రస్తావించిన పోలికలు దురదృష్టకరమని పేర్కొన్నారు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు. పిట్రోడా అభిప్రాయాలతో తమ పారీ్టకి ఎలాంటి సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment