
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యంహకారి అంటూ నెటిజన్లు సారాపై మండిపడుతున్నారు. సారా పోస్ట్ చేసిన ఓ మ్యాగ్‌జైన్ కవర్ ఫోటో ఈ విమర్శలకు కారణం అయ్యింది. వివరాలు.. సారా తొలిసారి ‘ఫిల్మ్‌ఫేర్’ అనే మ్యాగ్‌జైన్ కవర్ పేజీ మీద కనిపించింది. ఈ ఫోటో షూట్‌లో భాగంగా సారా ఓ మసాయి తెగ వ్యక్తితో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘నీ చదువు నీకిదే నేర్పిందా. ఇతరులు మన సంస్కృతిని గౌరవించాలని ఎలా భావిస్తామో.. అలానే మనం కూడా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని తెలీదా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ‘పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను, వారి సంస్కృతులను కించపర్చడం మంచిది కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలతో జనాలకు విసుగు తెప్పించకు. నీ ఫోటోలు జాత్యంహకారానికి నిదర్శనంగా నిలిచాయం’టూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment