ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన అవమానానికి మణిపురి యువతి మోనికా కంగెంబంకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ క్షమాపణ చెప్పారు. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు తన పరిధిలోకి లేవని వెల్లడించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించేలా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరతానని అన్నారు. మోనికా కంగెంబంకు జరిగిన అవమానంపై సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో స్పందించారు.