‘అతి సర్వత్ర వర్జయేత్’ .. (ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు)అని పెద్దలు ఊరకనే అనలేదు. ఏదైన మన శరీరం తట్టుకోలేనంతగా అధికంగా ఏ పని చేసినా అది ప్రమాదమే . అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ చాలామంది అత్యుత్సహంతోనో లేక మరే ఇతర కారణాల వల్ల కొన్ని పనులు అతిగా చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన నిర్లక్యమో లేక అతని పై అధికారి నిర్లక్ష్యం కారణంగానో తెలియదు గానీ అతిగా ఆడి పెద్ద ప్రమాదాన్నే కొనితెచ్చుకున్నాడు.
వివరాల్లోకెళ్లితే...యూకేలోని రీడింగ్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మైక్‌బ్రోకీ ఏప్రిల్ 2019లో కంపెనీ వార్షిక ఈవెంట్‌లో భాగంగా పబ్ గోల్ఫ్ గేమ్‌ని ఆడాడు. ఐతే విరామం తీసుకోకుండా గోల్ఫ్ గేమ్ అదేపనిగా ఆడాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఇక అప్పటి నుంచి బ్రోకీ కొన్నాళ్లపాటు కోమాలోనే గడిపాడు. అంతేకాదు అతను పుర్రెలో సగ భాగాన్ని కూడా తొలగించారు వైద్యులు. కోలుకోవడానికి అతనికి దాదాపు ఆరునెలలు పట్టింది.
దీంతో అతను తనకు జరిగినదానికి పరిహారంగా పీడబ్ల్యూసీ కంపెనీ యజమాని సుమారు రూ.1.87 కోట్లు ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కాడు. తన మేనేజర్ సైమెన్ ఫ్రాడ్గలీ తన సహోద్యోగుల భద్రతను పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశాడు. బ్రోకీ పిటిషన్‌లో పబ్ గోల్ఫ్ ఈవెంట్‌లో తీవ్రంగా గాయపడటం అనేది ఊహజనితమైన విషయంగా ఉంటుందని పేర్కొన్నాడు. తన తలకు అయిన తీవ్ర గాయం కారణంగా ఇప్పటికి కొన్నింటిని గుర్తించుకోలేకపోతున్నానని వాపోయాడు.
ఐతే లండన్ హైకోర్టు పీడబ్ల్యూసీ కంపెనీ తన మేనేజర్ నిర్లక్ష్యానికి భాద్యత వహించాలని స్పష్టం చేసింది. అలాగే కంపెనీలో ఏడేళ్లుగా కొనసాగతున్న వార్షిక ఈవెంట్‌ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. భాద్యతయుతమైన యజమానిగా ఉద్యోగుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటాం గానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది.
(చదవండి: యువతి హల్‌చల్.. ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి!)
Comments
Please login to add a commentAdd a comment