
'నన్ను దెయ్యాలు వెంటాడుతున్నాయి.. నమ్మరేం'
తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు
లండన్: తనను గత కొద్ది రోజులుగా దెయ్యాలు వెంటాడుతున్నాయని ప్రముఖ హాలీవుడ్ గాయకురాలు కెర్రీ కతోనా అన్నారు. ఈ విషయం చెప్తుంటే తనను అందరూ పిచ్చిదానిలా చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం అవతలివారికి చేరవేయడంలో తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ఎవ్వరూ తన మాటలు నమ్మడం లేదని అన్నారు.
34 ఏళ్ల కతోనా పాత నివాసం ఆక్స్ ఫోర్డ్ షైర్లో ఆత్మలు సంచరిస్తున్నాయని తొలుత ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం నేను దానిని ఓ ఇంటిలా భావించడం లేదు. ఏదో నన్ను వెంటాడుతుంది. ప్రజలు నన్ను పిచ్చిదాన్నని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం నన్ను ఎవరో వెంటాడుతున్నారనే విషయం చెప్పగలను. అసలేం జరుగుతోందని కొంతమంది నా చుట్టూ మూగుతున్నారు' అని ఆమె అంటోంది.