Man Dragged In Gym, Video Viral On Social Media: జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది - Sakshi
Sakshi News home page

జిమ్‌లో ‘దెయ్యం’.. కాలు పట్టుకుని మరీ లాక్కెళ్లింది

Published Thu, Aug 19 2021 5:15 PM | Last Updated on Thu, Aug 19 2021 6:04 PM

Spooky Video Shows Man Dragged Across Gym Floor by Invisible Force - Sakshi

దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే విషయం మీద ఎప్పటికి చర్చలు నడుస్తూనే ఉంటాయి. చాలా మంది దెయ్యాలున్నాయని విశ్వసిస్తే.. కొందరు మాత్రం అదంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తారు. ఇక ఇంటర్నెట్‌లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. అయితే వీటిలో చాలా మటుకు ఫేక్‌ వీడియోలే అని మనం గుర్తించగలం. కానీ కొన్ని వీడియోలుంటాయి.. ఎంతటి ధైర్యవంతులైనా సరే.. వాటిని చూస్తే.. దడుసుకోవాల్సిందే. ఈ తరహాకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎక్సర్‌సైజ్‌ చేసుకుందామని జిమ్‌కు వచ్చిన వ్యక్తిని ‘దెయ్యం’ పరుగులు పెట్టించింది. కాలు పట్లుకుమని లాక్కెళ్లింది. ఆ వివరాలు..

టిక్‌టాక్‌ యూజర్‌ @carlosruizoficial పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిలో జిమ్‌కు వెళ్లిన ఓ వ్యక్తిని అదృశ్య శక్తి ఫ్లోర్ అంతటా లాగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎక్సర్‌సైజ్‌ కోసం ఓ వ్యక్తి జిమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో జిమ్‌లో అతనొక్కడే ఉన్నాడు. ఇక అతడు వామప్‌ చేసుకుంటూ ఉండగా.. అతడి వెనక ఉన్న కొన్ని జిమ్‌ పరికరాలు వాటంతట అవే కదులుంతుంటాయి. 

మొదట ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ తర్వాత మరి కొన్ని పరికరాలు అలానే అసాధారణ రీతిలో కదలడం మొదలవుతుంది. వీటన్నింటిని గమనించిన సదరు వ్యక్తి అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని భావించి... బయటకు వెళ్లాలని అనుకుంటాడు. ఇక తనతో పాటు తీసుకువచ్చిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్తుండగా.. సడెన్‌గా కిందపడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి అతడి కాలు గాల్లోకి లేస్తుంది. ఆ తర్వాత ఎవరో అతడి కాలు పట్టి జిమ్‌ ఫ్లోర్‌ మీద కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వదిలేయగానే.. ఆ వ్యక్తి కాలుకు పని చెప్పి.. అక్కడ నుంచి బయటకు పరిగెత్తాడు. 

ఈ వీడియోపై నెటిజనులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి స్టంట్‌లు చేశారు.. అక్కడ దెయ్యం లేదు పాడు లేదు అంటుం‍డగా.. మరి కొందరు దెయ్యం కూడా జిమ్‌ చేద్దామని వచ్చి ఉంటుంది.. అతడు అక్కడే ఉండటం దానికి నచ్చలేదేమో.. అందుకు ఇలా బయటకు గెంటేసింది అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement