ఓ చిన్నారి ఒళ్లో బొమ్మను కూర్చోబెట్టుకుని ఆడుకుంటోంది. ఆమెకు కొంత దూరంగా మరో బొమ్మ ఉంది. ఉన్నట్టుండి ఆ బొమ్మ తలాడించడం, ఒక జడ పైకి లేపడం లాంటివి చేయసాగింది.

ఓ చిన్నారి ఒళ్లో బొమ్మను కూర్చోబెట్టుకుని ఆడుకుంటోంది. ఆమెకు కొంత దూరంగా మరో బొమ్మ ఉంది. ఉన్నట్టుండి ఆ బొమ్మ తలాడించడం, ఒక జడ పైకి లేపడం లాంటివి చేయసాగింది. ఆ విషయం సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది గానీ, అప్పటికి ఆ చిన్నారి ఏమీ చూడలేదు. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి వేరే గదిలోకి వెళ్లి టేబుల్ మీద కొన్ని కాగితాలు పెట్టుకుని ఏదో రాసుకోసాగింది.
గదిలో కిటికీ తలుపులు ఏమీ తీసి లేవు. ఫ్యాన్ కూడా వేసి లేదు. అయినా ఉన్నట్టుండి కాగితాలు ఎగిరిపోయాయి. వాటి మీద ఉన్న డస్టర్ కింద పడిపోయింది. దూరంగా ఒక టేబుల్ మీద ఉన్న రిమోట్ కంట్రోల్, మందుల డబ్బా తలోవైపు పడిపోయాయి. కాగితాలు ఎగరగానే ఒక్కసారిగా భయపడిన చిన్నారి అక్కడినుంచి పారిపోయింది. ఆ తర్వాత క్రమంగా ఆమె కాగితాలు పెట్టుకున్న టేబుల్ జరగసాగింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజిలో రికార్డయింది.
తమ ఇంట్లో ఏదో దెయ్యం ఉందని, అదే తమ కూతురిని భయపెడుతోందని ఆ చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. ఈ వీడియోను అమ్మాయి తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లో తాము లేనప్పుడు అమ్మాయి భద్రత కోసం కెమెరాలు పెట్టామని, అందులో ఈ దెయ్యం చేష్టలు రికార్డయ్యాయని చెప్పారు. అయితే ఈ వీడియో ఏ దేశంలోనిదో, ఎప్పుడు రికార్డు చేశారో మాత్రం తెలియలేదు.