బర్త్‌డే పార్టీలో దెయ్యం.. వీడియో వైరల్‌ | Ghost Caught On Camera At Birthday Party In Raichur | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీలో దెయ్యం.. వీడియో వైరల్‌

Published Fri, Jan 8 2021 8:43 PM | Last Updated on Fri, Jan 8 2021 8:55 PM

Ghost Caught On Camera At Birthday Party In Raichur - Sakshi

బెంగళూరు: బర్త్‌డే పార్టీ అంటే సాధారణంగా ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరవుతారు. కానీ రాయ్‌చూర్‌లో జరిగిన ఓ బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి వచ్చింది. ఇలా వచ్చి అలా మెరుపుతీగలా మాయమైన ఈ అతిథి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎవరా గెస్ట్‌ అనుకుంటున్నారా.. దెయ్యం. వినగానే కాస్త భయం వేసినా ఇది మాత్రం వాస్తవం. పైగా వీడియో కూడా ఉంది. ఆ వివరాలు.. రాయ్‌చూర్‌లో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకను వెరైటీగా పెట్రోల్‌ బంక్‌లో ఏర్పాటు చేశారు. 

ఫ్రెండ్స్‌ అంతా వచ్చి.. కేక్‌ కట్‌ చేసి బర్త్‌డే బాయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మిగతా స్నేహితులు దీన్ని వీడియో తీసే పనిలో ఉన్నారు. యువకులంతా ఇలా ఎంజాయ్‌ చేస్తుండగా.. ఉన్నట్టుండి వీరి వెనక నుంచి ఓ ఆకారం పరిగెత్తడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన నెటిజనులు ‘‘ఇదంతా ట్రిక్‌‌, ఆత్మ కాదు పాడు కాదు.. పొగ అలా కనిపించింది’’ అని కామెంట్‌ చేస్తున్నారు.
(చదవండి: ప్రాంక్ కాదు, అక్క‌డ నిజంగానే దెయ్యం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement