అందమైన దెయ్యం! | Anushka Sharma Upcoming Movie Ghost Story | Sakshi
Sakshi News home page

అందమైన దెయ్యం!

Published Mon, Apr 18 2016 1:38 PM | Last Updated on Tue, Oct 2 2018 3:46 PM

అందమైన దెయ్యం! - Sakshi

అందమైన దెయ్యం!

దెయ్యం అందంగా ఉంటుందా? ఉంటుందట. అచ్చంగా అనుష్కా శర్మ అంత అందంగా ఉంటుందట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు... ఓ చిత్రంలో ఈ బ్యూటీ దెయ్యంలా నటించనున్నారు. మనిషి పాత్రలకన్నా దెయ్యం పాత్రలకు నటనకు స్కోప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే అనుష్కా శర్మ ఈ పాత్ర చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తన హోమ్ బేనర్‌లోనే నిర్మించనున్నారు. ‘ఎన్‌హెచ్10’ ద్వారా ఆమె నిర్మాతగా మారిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో రెండో సినిమా మొదలుపెట్టనున్నారు.

ఇటీవలే కథ ఫైనలైజ్ చేశారు. ఈ చిత్రానికి ‘ఫిలౌరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కామెడీ, హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె దెయ్యంగా భయపెడుతూ, నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. పంజాబీ పెళ్లి నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దీనికి అన్షాయ్ లాలా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement