
అక్కడ దయ్యాలున్నాయా?!
దయ్యాలున్నాయా? ఆత్మలున్నాయా? అనే ప్రశ్నలు వేస్తే.. నమ్మమున్నోడికి ఉంటాయి.. లేనోడికి ఉండవు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడింత హఠాత్తుగా ఈ ప్రశ్నలు ఎందుకంటే..
బ్రస్సెల్స్ : దయ్యాలున్నాయా? ఆత్మలున్నాయా? అనే ప్రశ్నలు వేస్తే.. నమ్మమున్నోడికి ఉంటాయి.. లేనోడికి ఉండవు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడింత హఠాత్తుగా ఈ ప్రశ్నలు ఎందుకంటే.. తాజాగా బెల్జియం సముద్ర తీరంలో ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్‌ను నేవీ అధికారులు గుర్తించారు. సముద్రమన్నాక ఎన్నో మునుగుతుంటాయి.. టైటానిక్ మునిగి పోలేదా అన్న ప్రశ్న మీ దగ్గర నుంచి సహజంగానే వస్తుంది.. అందుకే నేరుగా విషయానికి వస్తున్నా..
ఈ సబ్ మెరైన్ మునిగిన ప్రాంతంలో అటుగా ఏవైనా నౌకలు, చేపలు పట్టే జాలర్లు వెళుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు.. మనుషులు బాధపడుతున్నట్లుగా ఏడుపులు వస్తుంటాయట. మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా తాజా సబ్ మెరైన్ బయటపడ్డంతో అందరూ ఇదే అలోచిస్తున్నారట.
భూమికి 98 అడుగుల లోతులో యూబీ-2 టైప్ సబ్ మెరైన్ ఎప్పుడో మునిగింది. దీనితో అందులో ప్రయాణిస్తున్న 23 మంది మరణించారు. దీనిని బుధవారం నేవీ సిబ్బంది గుర్తించింది. ఇంకో విషయం ఏమిటంటే.. సబ్ మెరైన్ ఇంకా కండీషన్‌లోనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలాఉంటే.. అందులోని 23 మృత దేహాలు కూడా పెద్దగా పాడవకుండా ఉన్నాయట. ఈ 23 మందే దయ్యాలుగా మారారని.. వాళ్లే ఇటుగా ఎవరైనా వస్తుంటే.. చిత్రవిచిత్రంగా శబ్దాలు చేస్తున్నారేమోనని స్థానికులు అనుకుంటున్నారు.