కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఓ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా ఈ మోషన్ పోస్టర్ ఉంది.
కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, మెషీన్ గన్... వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివ రాజ్ వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్ ల మీద భారీగా నిర్మించిన ప్రిజన్ ఇంటీరియర్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Make way for ya’ man #GHOST.
— DrShivaRajkumar (@NimmaShivanna) January 1, 2023
Presenting you the MotionPoster of #GHOST..
shooting in progress@lordmgsrinivas @ArjunJanyaMusic@SandeshPro@baraju_SuperHit pic.twitter.com/GGLr3Caxcg
Comments
Please login to add a commentAdd a comment