ఆకాశంలో దెయ్యం | A huge galaxy in distant space | Sakshi
Sakshi News home page

ఆకాశంలో దెయ్యం

Published Thu, Dec 7 2023 1:08 AM | Last Updated on Thu, Dec 7 2023 1:08 AM

A huge galaxy in distant space - Sakshi

పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్‌ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్టీ) సాయంతో టెక్సాస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు.

మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement