
న్యూయార్క్ : ‘‘మా ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. అర్థరాత్రి సమయంలో ఓ దెయ్యం పిల్లాడు, చిన్న కుక్కపిల్లతో మా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అది మా ఇంట్లోని సీసీకెమెరాల్లో రికార్డైంది’’ అంటున్నాడు అమెరికాకు చెందిన జోయ్ నోలన్ అనే వ్యక్తి. ఇందుకు రుజువుగా ఆగస్టు 8న తన ఇంటి కిచెన్ దగ్గర చోటుచేసుకున్న సీసీటీవీ దృశ్యాలను చూపెడుతున్నాడు. జోయ్ నోలాన్ తెలిపిన వివరాల మేరకు.. లాంగ్ ఐలాండ్‌కు చెందిన జోయ్ నోలాన్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి సమయాల్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించేది. దీంతో కొద్దిరోజుల క్రితం అతడు తన ఇంటి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి చూశాడు. ఆగస్టు 8నాటి సీసీటీవీ దృశ్యాలను చూడగానే అతడి ఒళ్లు జలదరించింది. రెండు వింత ఆకారాలు ఇంట్లో అటు ఇటు పరిగెత్తడం అతడి కంటపడింది.
కొంచెం పరిశీలనగా చూడగా అది ఓ పిల్లాడు అతడి కుక్కపిల్ల ఆత్మలుగా జోయ్ గుర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో ఉంచి నెటిజన్ల సలహాలను కోరాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘ఈ మధ్య ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా?... స్పష్టంగా ఏమీ కనిపించటం లేదు. కానీ, ఎవరో అక్కడ తిరుగుతున్నట్లు మాత్రం అనిపిస్తోంది’’ అంటూ కామెంట్ చేశాడు. జోయ్ ఇందుకు ప్రతిగా స్పందిస్తూ.. ‘‘ఈ మధ్య ఎవరూ చనిపోలేదు. అంతకు పూర్వం ఎవరన్నా చనిపోయారేమోనని తెలుసుకుంటున్నాం. ఆగస్టు 8కి ఈ సంఘటనతో సంబంధం ఉందని నా అభిప్రాయం. అంతుకు ముందు, ఆ తర్వాత గానీ అలాంటి సంఘటనలు జరగలేదు’’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment