
దెయ్యప్పిల్ల! మీకో టెస్ట్!
మిస్సింగ్
ఈ ఫొటోలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6... యు ఆర్ రైట్! ఈ అమ్మాయిలంతా ఏం చేస్తున్నారు? చక్కగా నవ్వుతున్నారు.... యు ఆర్ రైట్! వీళ్లంతా ఎక్కడ కూర్చొని ఉన్నారు? సోఫాలో... యు ఆర్ రైట్! వీళ్ల చేతుల్లో ఏం ఉన్నాయి? ఏవో డ్రింక్స్... యు ఆర్ రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సోఫాలో మధ్యలో కూర్చొని ఉన్న అమ్మాయి కాళ్లెక్కడ ఉన్నాయి? (పట్టె మీద కూర్చున్న అమ్మాయిని వదిలెయ్యండి).
మిగతా ఐదుగురిలో... మధ్యలో ఉన్న అమ్మాయి కాళ్లు ఎక్కడున్నాయి? టైమ్ తీసుకోండి. కరెక్ట్ సమాధానం చెప్పండి. ఆ పిల్ల కాళ్లు ఎక్కడున్నాయో కనిపెడితే మీరు గ్రేట్. కనిపెట్టలేకపోతే... ఆ పిల్ల దెయ్యప్పిల్లే! ఇటీవలే ఈ ‘దెయ్యం’ నెట్‌లోకి వచ్చేసింది. కొందరికైతే కలలోకీ వచ్చేస్తోందట.