బిగ్‌బాస్‌లోకి కొత్త అతిథి.. జడుసుకున్న బోల్డ్‌ గర్ల్ | Bigg Boss 4 Telugu: Ghost In Bigg Boss House | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌లోకి కొత్త అతిథి.. జడుసుకున్న బోల్డ్‌ గర్ల్

Published Wed, Nov 25 2020 3:52 PM | Last Updated on Wed, Nov 25 2020 7:12 PM

Bigg Boss 4 Telugu: Ghost In Bigg Boss House - Sakshi

తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది. షో ముగింపునకు మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని మరింత రసవత్తంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. కొత్త కొత్త గేమ్‌లు, కొత్త తరహా టాస్క్‌లను ప్రవేశపెట్టి మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ కూడా కాస్త వెరైటీగా నిర్వహించారు. శవాల పేటికలను తీసుకురావడం, అలాగే ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ తీసుకొచ్చి  పొలిటికల్ తరహాలో అవినాష్, అఖిల్‌తో ప్రచార సందడి చేయించారు. ఇలా ప్రతి రోజు ఏదోఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు.  

ఇక బుధవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఓ అతిథిని పంపి అందరిని భయపెట్టే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని కొత్త తరహా సెట్స్ ని యాడ్ వేశారు. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హౌజ్ మెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇంట్లో దెయ్యాన్ని చూసి అందరి కంటే బోల్డ్‌ గర్ల్‌ అరియానానే ఎక్కువగా భయపడింది. దెయ్యం మొదటగా అరియానాకే కనిపించడంతో భయంతో బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది. ఇక సోహైల్‌ అయితే నేను భయపడేదిలేదంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అరియానా భయంతో వణికిపోతుంటే.. హారిక మాత్రం ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి దానికి భయపడితే వాళ్ళు నీ మీదనే ఫోకస్ చేసి ఇంకా భయపెడతారని చెప్పింది. అందుకు అరియానా నేను ఏమి భయపడటం లేదని చెప్పడంతో.. హారిక పీకినవ్ తీయ్ అంటూ మరో  కౌంటర్ ఇచ్చింది.ఇక సోహైల్‌ అయితే కెమెరా ముందుకు చూస్తూ ‘హలో దెయ్యం ఎక్కడున్నావ్ అంటూ.. భయపడతారు అనుకుంటున్నారా? అలా రాత్రి మాత్రం రాకండి ’ అంటూ తనదైన శైలీలో కామెడీ పంచ్‌ వేశాడు.
(చదవండి : నువ్వు మా నాన్న‌కు న‌చ్చావంటే..: అభిజిత్‌)

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో అవినాష్‌ కామెడీ హైలెట్‌ కాబోతున్నట్టు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది.  దెయ్యం గురించి హారిక అవినాష్‌తో మాట్లాడుతూ.. ఆ మిర్రర్ లో నుంచి రెండు పెద్ద చేతులు వచ్చి నిన్ను లోపలికి గుంజుకపోవాలి అని అనగా.. లాక్ రాగానే రెండు చేతులకు నేయిల్ పాలిష్ పెట్టేస్తానని అవినాష్‌ పంచ్‌ వేశాడు. అలాగే చంద్రముఖి డైలాగ్ చెప్పి అందరిని నవ్వించాడు. నేను వెంకటపతి రాజా ఈ దుర్గాష్టమికి నిన్ను అదే అంటూ.. అంటూ అవినాష్‌ చెప్పిన డైలాగ్‌కి  ఇంటి సభ్యులు పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే హే అవినాష్ అని ఒక లేడి దెయ్యంలా సౌండ్ వచ్చింది. అనంతరం వస్తా.. అంటూ గట్టిగా అరిచేసింది. అసలు హౌస్‌లోకి దెయ్యం ఎందుకు వచ్చింది? హౌస్‌మేట్స్‌తో దెయ్యం ఎలా ఆడుకుందో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే నేటి ఎపిసోడ్‌ని చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement