న‌న్ను పంపించినా డోంట్ కేర్‌: అరియానా | Bigg Boss 4 Telugu: Ariyana Cry And To Question Bigg Boss | Sakshi
Sakshi News home page

ఆమె ఎందుకంత‌ సీన్ క్రియేట్ చేస్తుంది?: అవినాష్‌

Published Wed, Dec 2 2020 11:19 PM | Last Updated on Fri, Dec 4 2020 1:22 AM

Bigg Boss 4 Telugu: Ariyana Cry And To Question Bigg Boss - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఫినాలే రేస్ న‌డుస్తోంది. ఏడుగురితో మొద‌లైన ఈ పోటీ ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య‌నే జ‌ర‌గ‌నుంది. అంద‌రినీ దాటుకుని అఖిల్, సోహైల్ మూడో లెవ‌ల్‌లో అడుగు పెట్టారు. వీరిలో ఎవ‌రు గెలిచినా ఇద్ద‌రూ సంతోషించేవాళ్లే. అరియానా, అవినాష్ మాత్రం వీళ్ల మీది కోపాన్ని బిగ్‌బాస్ మీద చూపించారు. ఈ ఇద్ద‌రు క‌లిసి ఆడుతూ ఫినాలేకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని ఆవేద‌న చెందారు. నిన్న వాళ్లు క‌లిసి ఆడుతుంటే బిగ్‌బాస్ ఎందుకు ఆప‌లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అటు హారిక కూడా గెలిచేందుకు త‌న సాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఓట‌మిపాల‌వ‌క త‌ప్ప‌లేదు. మ‌రి నేటి 88వ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఏమేం జ‌రిగాయో తెలియాలంటే దీన్ని చ‌దివేసేయండి..

త‌న్నినందుకు సారీ చెప్పిన మోనాల్‌!
నిన్న పాలు పిత‌క‌డం టాస్కులో అఖిల్‌, సోహైల్ మాత్ర‌మే క‌లిసి ఆడ‌లేదు. అభిజిత్ హారిక ద‌గ్గ‌ర పాల బాటిళ్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ఆమెకు కొన్నింటిని ఇచ్చి సాయం చేశాడు. అటు అఖిల్ కూడా మోనాల్‌కు బాటిళ్లు ఇచ్చిన‌ప్ప‌టికీ ఆమె తిరిగి ఇచ్చేసింది. అయితే అవినాష్.. అఖిల్‌, సోహైల్ క‌లిసి ఆడటం వ‌ల్ల త‌న‌ గేమ్ డిస్ట‌ర్బ్ అయింద‌ని ఆవేద‌న చెందాడు. మోనాల్ త‌న్న‌డం వ‌ల్ల మ‌రింత‌ హ‌ర్ట్ అయ్యాన‌ని చెప్పాడు. అయితే మోనాల్‌ను అడిగితే త‌న్న‌లేద‌ని చెప్పింద‌ని సోహైల్ క్లారిటీ ఇవ్వ‌గా అభి మాత్రం ఆమె అబ‌ద్ధాలు ఆడుతుంద‌ని, అందుకే ఆమె ఫ్రెండ్‌షిప్ వ‌ద్ద‌న్నాను అని చెప్పుకొచ్చాడు. ఒక‌వేళ మోనాల్‌ నిజంగా త‌న్నితే మాత్రం ఆమెతో మాట్లాడ‌ను అని సోహైల్ చెప్పాడు. ఎందుకొచ్చిన గొడ‌వ అనుకుందో ఏమో కానీ మోనాల్ వెళ్లి అవినాష్‌ను కూల్ చేసేందుకు సారీ చెప్పి, ముద్దు పెట్టింది. (చ‌ద‌వండి: నీతో రిలేష‌నే వ‌ద్దు: తేల్చేసిన అఖిల్‌)

గొడ‌వ‌కు పునాది వేసిందే హారిక‌..
త‌ర్వాత‌ ఫినాలే రేసులో రెండో లెవ‌ల్ ప్రారంభ‌మైంది. ఇందులో పై నుంచి ప‌డే పూల‌ను సేక‌రించి మ‌ట్టిలో నాటాలి. ఎక్కువ పూలు నాటిన ఇద్ద‌రు త‌ర్వాతి లెవ‌ల్‌కు అర్హ‌త సాధిస్తారు. ఈ పూలు ప‌ట్టుడు టాస్క్‌లో అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక ఎవ‌రికి వారే సాటి అన్న‌ట్లుగా పోరాడారు. మొద‌ట‌ హారిక.. సోహైల్ చేతిలో నుంచి పువ్వు లాక్కోవ‌డంతో అత‌డు ఆమె చేతికందిన పువ్వుల‌న్నింటినీ లాక్కోవ‌డం ప్రారంభించాడు. దీంతో ఖంగు తిన్న హారిక‌కు దుఃఖం పొంగుకొచ్చింది. త‌ర్వాత ఇది గొడ‌వ‌గా మారింది. కానీ సోహైల్ సానుభూతితో చివ‌ర‌కు త‌ను లాక్కున్న‌వాటిని ఆమెకే తిరిగి ఇచ్చేశాడు. అయినా స‌రే ఆమె మ‌ట్టిలోఎక్కువ పూలు నాట‌లేక‌పోవ‌డంతో ఈ లెవ‌ల్ నుంచి నిష్క్ర‌మించింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్‌తో డేట్‌.. అభి కంటతడి)

బిగ్‌బాస్ మీదే ఫైర్ అయిన అరియానా
నిన్న ఇద్ద‌రు క‌లిసి ఆడిన‌ప్పుడు బిగ్‌బాస్ వ్య‌క్తిగ‌త ఆట అని హెచ్చ‌రించ‌లేదు కానీ ఈ రౌండ్‌లో మాత్రం ఎందుకు హెచ్చ‌రించాడ‌ని అరియానా బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చింది. నిన్న వ్య‌క్తిగ‌తంగా ఆడి ఓడిపోయాను. మీరు న‌న్ను ఇప్ప‌టికిప్పుడు పంపించేసినా నేను అస్స‌లు లెక్క చేయ‌ను, కానీ మీరు చేస్తోంది మాత్రం త‌ప్పు..‌ అని అరియానా బిగ్‌బాస్ మీద మండిప‌డింది. అఖిల్‌, సోహైల్ క‌లిసి ఆడి టాప్‌ 5లోకి వెళ్లిపోదామ‌నుకుంటున్నారు అని అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. ఇక ఈ లెవ‌ల్‌లో హారిక‌, అభిజిత్ ఓడిపోగా ఇద్ద‌రు స్నేహితులు అఖిల్‌, సోహైల్ త‌ర్వాతి ఘ‌ట్టంలోకి అడుగు పెట్టారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ వారం అవినాష్ త‌ప్పించుకోలేడా?)

ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుంది..
ఇంటి ప‌నులు చేయాల్సిన విష‌యంలో అవినాష్‌, అరియానా గొడ‌వ ప‌డ్డారు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేద‌ని న‌న్ను ఎందుకు అన్నావు? అని అవినాష్ ప్ర‌శ్నించ‌డంతో ఆమె సారీ, క్ష‌మించు అంటూ దండం పెట్టేసింది. నేను నామినేష‌న్‌లో ఉన్నాను, నువ్వు అలా మాట్లాడొద్దు, ఇలా బిహేవ్ చేయొద్దంటూ అవినాష్ సీరియ‌స్ అవ‌డంతో అభి అత‌డికి న‌చ్చ‌జెప్పాడు. అటు అరియానా బాధ‌తో ఏడుస్తుంటే కూడా ఇది కూడా కాలిక్యులేట్ అవుతుంద‌ని లెక్క‌లు వేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన అరియానా నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా? అని మండిప‌డింది. ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుంద‌ని అవినాష్ చిరాకు ప్ర‌ద‌ర్శించాడు. కానీ కాసేప‌టికే ఒంట‌రిగా బాధ‌ప‌డుతున్న అరియానా ద‌గ్గ‌ర‌కు వెళ్లి బుజ్జ‌గించాడు. నువ్వు అలా మాట్లాడ‌కూడ‌దు అని చెప్ప‌డానికే వ‌చ్చాన‌న‌డంతో ఇక నుంచి నా మాట‌లు కంట్రోల్ చేసుకుంటాన‌ని అరియానా  ముక్త‌స‌రిగా మాట్లాడింది. దీంతో అవినాష్‌ ఆమెను హ‌త్తుకుని ఓదార్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement