బిగ్‌బాస్‌ : నీకు పడిపోతా అవినాష్‌.. అరియానా | Bigg Boss 4 Telugu : Contestants Celebrates Diwali Festival | Sakshi
Sakshi News home page

ఆయన ఐడియాలు మాత్రమే ఇస్తాడు.. సోహైల్‌

Published Fri, Nov 13 2020 11:18 PM | Last Updated on Sat, Nov 14 2020 7:43 AM

Bigg Boss 4 Telugu : Contestants Celebrates Diwali Festival - Sakshi

బిగ్‌బాస్‌లో హౌస్‌లో ఒక్క రోజు ముందే దీపావళి వేడుకలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులంతా దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా ఇళ్లంతా ముస్తాబు చేశారు. పండగ వేళ  బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ముఖ్యంగా లాస్యకు ఇచ్చిన గిఫ్ట్‌అయితే హైలెట్‌గా నిలించింది. ఇంతకీ బిగ్‌బాస్‌ ఇచ్చిన గిఫ్ట్‌లు ఏంటివి.. ఆ గిఫ్ట్‌లు పొందేందుకు ఇంటిసభ్యులు చేసిన టాస్క్‌లు ఏంటో చదివేద్దాం.

నిన్న మటన్‌.. నేడు గుడ్లు
అవినాష్‌ రేషన్ మెనేజర్‌ ఏ ముహుర్తాన అయ్యాడో కానీ.. ఆయనకి అన్నీ అపశకునాలే ఎదరవుతున్నాయి. నిన్న మటన్‌ చెడిపోవడంతో అవినాష్‌ని హౌస్‌మేట్స్‌ చితకబాదగా.. నేడు గుడ్లు పగులకొట్టి ఇంట్లో అడ్డంగా బుక్కయ్యాడు. గుడ్లు పగిలిన విషయం దాచేందుకు అవినాష్‌ ప్రయత్నించగా.. అరియానా ఠక్కున వెళ్లి సోహైల్‌, మెహబూబ్‌కు విషయం చెప్పింది. ఇంకేముంది వారిద్దరూ అవినాష్‌ని ఓ రేంజ్‌లో వేసుకున్నారు. నిన్న మటన్‌ పాడు చేశావు.. ఈ రోజు గుడ్లు పగుల గొట్టావ్‌.. నువ్వేం రేషన్‌ మేనేజరవయ్యా.. అంటూ సోహైల్‌, మెహబూబ్‌, అరియానా కలిసి అవినాష్‌ని కుమ్మెశారు.

అరియానాతో అవినాష్‌ పులిహోరా
ఇక సందు దొరికితే చాలు అమ్మాయిలతో పులిహోరా కలిపే అవినాష్‌.. ఈ రోజు అరియానాతో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.  అరియానా చాలా బాగుంటుంది కదా అని మోహబూబ్‌తో అనగా... ఏమో నాకు తెలియదు అంటూ మెహబూబ్‌ తప్పించుకున్నాడు. ఇక అవినాష్‌ మాటలకు అరియానా ముసిముసి నవ్వులు నవ్వుతూనే అవినాష్‌కు అదిరిపోయే పంచ్‌లు వేసింది. ‘నువ్ నా ముందే ఇద్దరు ముగ్గుర్ని బాగుంటావ్ అని అన్నావ్.. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బాగుంటుంది కదా అంటే నేనేం పడను నీకు’ అంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో అవినాష్‌ తన మాటలను కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘నువ్ ఎవరు నాకు పడటానికి ఛల్.. అంతలేదు.. నీకూ అంత సీన్ లేదూ.. నాకూ అంత సీన్ లేదు.. అసలు నాకు ఆ ఆలోచనే లేదు. మనం ఫ్రెండ్స్ అంతే.  అవసరమే లేదు ‘ఛీ ఛీ’  అని ఆ మ్యాటర్‌ని కవర్‌ చేశాడు. ఇక అవినాష్‌ బాధను అర్థం చేసుకున్న అరియానా.. ఓకే అవినాష్‌ నేను నీకు పడిపోతాలే అని చెప్పింది. దీంతో అవినాష్‌ ‘మనం ఫ్రెండ్స్ ఎందుకు పడతాం.. ఈ పడిపోవడాలు ఏంటి?? ఏం మాట్లాడుతున్నావ్..’ అంటూ మ్యాటర్‌ డైవర్ట్‌ చేశాడు. 

ఇక అరియానా పింక్ శారీ కట్టుకుంటే.. అవినాష్ కూడా పింక్ షర్ట్ వేసుకున్నాడు.. అరియానా కోసమే పింక్ వేసుకున్నావా? అని మెహబూబ్ అనడంతో.. అవునా అవినాష్ నువ్ నాకోసం పింక్ వేసుకున్నావా?? అని అరియానా అడగడంతో.. ‘బొక్కేం కాదు.. నేను నీకోసం ఎందుకు పింక్ వేసుకుంటా.. నీకు అంత లేదు.. ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయకు’ అంటూ అవినాష్ కాస్త ఓవర్‌గానే రియాక్ట్ అయ్యాడు.. 

నవ్వులు పూయించిన ‘నవ్వడం నిషేధం టాస్క్‌’
ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి తీసువస్తే.. మీరెవరూ ఎంటర్మైంట్ చేయడంలో విఫలమయ్యారంటూ హౌస్‌మేట్స్‌పై బిగ్‌బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పనిష్మెంట్‌గా ‘నవ్వడం నిషేధం’ టాస్క్‌ ఇచ్చాడు.  అంటే ఇంటి సభ్యులు ఒక్కరినొక్కరు నవ్వించుకోవాలి కానీ ఎవరూ నవ్వకూడదు. ఎవరైతే నవ్వుతారో వాళ్లు ఈ టాస్క్‌ ఓడిపోయినట్లు లెక్క. అలాగే బిగ్‌బాస్‌ కూడా ఇంటి సభ్యులను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.. కానీ హౌస్‌మేట్స్‌ బోర్‌గా ఫీల్‌ కావాలి.


పేలని లాస్య చీమ ఏనుగు జోక్‌
మొదటగా లాస్య వచ్చి తన చీమ ఏనుగు జోక్‌తో నవ్వించే ప్రయత్నం చేసింది. ఓ చీమ అందంగా ముస్తాబై వచ్చి ఏనుకు పడేసేందుకు ప్రయత్నిస్తుందని, కానీ ఏనుగు మాత్రం పడలేదని, చివరకు చీమ కాలు అడ్డం పెట్టి పడేసిందని.. ఇదే జోక్‌ అని తనకు తానే నవ్వుకుంది. ఇంటి సభ్యులెవరూ నవ్వలేదు. 

అరియానాకు సోహైల్‌ పంచ్‌
ఇక అరియానా మెహబూబ్‌, సోహైల్‌లను నవ్వించే ప్రయత్నం చేసి ఓడిపోయింది. సోహైల్‌ దగ్గరికి వెళ్లి. ‘మనం ఫస్ట్‌టైం కలిసినప్పుడు నీకు ఇలా ఇలా హాయ్‌ చెప్పా’ అని అరియానా అంటే.. ‘అయితే ఏంటి ఇప్పుడు’ అని సోహైల్‌ పంచ్‌ విసరడంతో అరియానా ఇక నవ్వించలేను బాబూ... అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్నేహితుడైన అవినాష్‌ దగ్గరకు వెళ్లి ప్రయత్నించగా.. అక్కడ కూడా సక్సెస్‌ కాలేదు. 

అందరిని నవ్వించిన అవినాష్‌
అవినాష్‌ మాత్రం అందరిని నవ్వించాడు. ముఖ్యంగా సోహైల్‌ అయితే అవినాష్‌ని చూసి నవ్వు ఆపులేకపోయాడు. ఇక అలాగే లాస్యను, మెహబూబ్‌ను తనదైన శైలీలో పంచ్‌లు వేస్తూ నవ్వించాడు. ఇక అవినాష్‌ పంచ్‌లకు సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్‌ కూడా పగలబడి నవ్వాడు.  ఇక మెహబూబ్‌ కుందేలు వేషం వేసి నవ్వించే ప్రయత్నం చేశాడు.

బిగ్‌బాస్‌ నోట సోహైల్‌ యాస
ఒక పక్క ఒక్కో ఇంటి సభ్యుడు మిగిలిన వాళ్లని నవ్వించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. మరో పక్క బిగ్‌బాస్‌ కూడా హౌస్‌మేట్స్‌పై ‘.జోకుల దాడి’ చేశాడు. సోహైల్‌ని పిలిచి.. ‘సోహైల్‌ ఏందీ పంచాయితీ.. కథెట్లుంది’ అంటూ అతని స్టైల్లో అన్నాడు. దీంతో సోహైల్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. బిగ్‌బాస్‌ నోట నా మాటలు వచ్చాయి ఇది చాలు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక అవినాష్‌ని కూడా బిగ్‌బాస్‌ ఆటపట్టించాడు. ‘అవినాష్‌ నీ తెలుగు బాగుంటంది. తెలుగులో నవ్వు అవినాష్‌’ అంటూ అతన్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. బిగ్‌బాస్‌ పంచ్‌లకు నవ్వట్లేదు .. నవ్వట్లేదు అంటూనే నవ్వేశాడు అవినాష్‌.

ఓడిపోయి బహుమతులు గెలిచారు
ఇక ‘నవ్వు నిషేధం’ టాస్క్‌లు హౌస్‌మేట్స్‌ అంతా ఓడిపోయారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే ఓడినా.. వినోదం పంచడంలో గెలిచారంటూ.. బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులంతా తమ తమ బహుమతులు తీసుకొని మురిసిపోయారు. 

లాస్యకు స్పెషల్‌ గిఫ్ట్‌
ఇక అందరికి బహుమతులు అందించిన బిగ్‌బాస్‌.. లాస్యకు మరో సర్‌ప్రైజ్‌ అందించాడు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఆమె కుమారుడు ‘జున్ను’ మాటలను వినిపించాడు. తన కొడుకు మాటలు విన్న లాస్య.. ఒక్కసారిగా ఆనందంతో ఇంట్లోకి పరుగులు తీసింది. కొడుకు ముసి ముసి నవ్వులు.. బుజ్జి బుజ్జి మాటలు విని ఎమోషనల్‌ అయింది. హౌస్‌మేట్స్‌ ‘జున్ను’ మాటలు విని ఆనందపడ్డారు.

బిగ్‌బాస్‌ ఇంట దీపావళి వేడుకలు
దీపావళి పండగ సందర్భంగా.. హౌస్‌మేట్స్‌కి గులాబ్‌ జామ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. లాస్య, మోనాల్‌ కలిసి గులాబ్‌ జామ్‌లను తయారు చేసి ఇంటి సభ్యులకు పంచారు. తర్వాత గార్డెన్‌ ఏరియాలో దీపాలు వెలిగించి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement