కొత్త దెయ్యం
దెయ్యాల్లో రకాలున్నాయి. కొరివి దెయ్యం, గత్తర దెయ్యం, బాదుడు దెయ్యం, మోహినీ దెయ్యం.. ఇలా! ఇంగ్లిష్‌లో అయితే డెవిల్, ఘోస్ట్, డ్రాక్యులా, పోల్టర్‌గీస్ట్, శాటాన్, ఫాంటమ్.. ఇలాంటివేవో కొన్ని. లేటెస్టుగా ఇప్పుడు కొత్త దెయ్యం ఒకటి వచ్చింది! ఎక్కడికి? మెరియం వెబ్‌స్టర్ డిక్షనరీలోకి. దాని పేరు ‘ఘోస్ట్’. ఘోస్ట్ అన్నది తెలిసిన దెయ్యమే కదా! ఇందులో కొత్తదనం ఎక్కడుందీ? కొత్తదనం మాటలో లేకపోవచ్చు, చేష్టలో ఉంది. ఇక నుంచి మీరు.. మీతో సడెన్‌గా కాంటాక్ట్‌ను కట్ చేసిన మీ ఫ్రెండ్‌ని కానీ, లవర్‌ని కానీ చక్కగా ‘ఘోస్ట్’ అని పిలిచేయొచ్చు.
కాల్స్‌కి, మెసేజెస్‌కి రిప్లయ్ ఇవ్వకుండా, రెస్పాండ్ కాకుండా సతాయించే మనిషికి ఆ డిక్షనరీ పెట్టిన పేరు ఘోస్ట్. ప్రస్తుతం మీ లైఫ్‌లో ఉన్న ఘోస్ట్ ఎవరో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి. వెనక్కి అంటే కాల్ హిస్టరీలోకి. అలాగే.. ‘స్వీయనింద’కు (మెప్పు కోసం మనల్ని మనం విమర్శించుకోవడం) ఈ డిక్షనరీ ఏuఝb ్ఛbట్చజ అనే పదం కాయిన్ చేసింది. హంబుల్‌బ్రాగ్! బాగుంది కదా. సవినయ దురహంకారం.