పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే.. | Dad films chilling scene in children's playground as swing moves on it's own as if pushed by ghost | Sakshi
Sakshi News home page

పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే..

Published Wed, Jul 6 2016 1:43 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే.. - Sakshi

పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే..

న్యూయార్క్: అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లిన ఓ వ్యక్తి తమ పిల్లలను అక్కడి ఊయలలు ఊగనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా.. దెయ్యం. అవును ఆ ఊయలలో దెయ్యం ఊగుతోందంట. ఆ విషయం ఆ వ్యక్తి స్వయంగా తెలపడం కాకుండా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ వీడియోను లక్షలమంది చూశారు. అమెరికాలోని రోడే ఐలాండ్ లో వార్విక్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం సరదాగా గడిపేందుకు వెళ్లింది.

అదే సమయంలో అదే కుటుంబంలోని ఓ మూడేళ్ల పాప బీచ్ ఒడ్డున ఉన్న ఊయల ఊగుతానని మారాం చేసింది. దీంతో ఆ కుటుంబం పాపను తీసుకునే ముందుకు రెండు అడుగులు వేయగా అనూహ్యంగా అందులో ఎవరు కూర్చోకుండానే ఆ ఊయల ఊగడం ప్రారంభించింది. దీంతో అవాక్కయిన ఆ పాప తండ్రి స్కాట్ పాపను వెళ్లనివ్వకుండా వీడియో తీయడం ప్రారంభించాడు. ఆ సమయానికి పెద్దగా గాలి ప్రభావం కూడా లేదని, ఊయలలో ఉన్న ఓ ఖాళీ కుర్చి ఎలా ఊగుతుందని ఆశ్చర్యపోయానని అతడు చెప్పాడు. పగలు కూడా దెయ్యాలు సంచరిస్తున్నాయా అనే గుండె ఆగినంత పనైందని అతడు తన అభిప్రాయం చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement