ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.
కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.
#monalisabhosle video #MahaKumbh2025 pic.twitter.com/OgosaBMXeg
— Narinder Saini (@Narinder75) February 2, 2025
ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
Comments
Please login to add a commentAdd a comment