చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం! | BBC Invites Doll With Dead Owner Eyes And Hair For Bargain Hunt | Sakshi
Sakshi News home page

చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!

Published Sun, Apr 9 2023 12:23 PM | Last Updated on Sun, Apr 9 2023 12:57 PM

Bbc Invites Charles Ras For Bargain Hunt Program - Sakshi

నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో  ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ​ పేరు జార్జ్‌. చార్లెస్‌ రాస్‌ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు.


వీటన్నింటినీ నాటింగ్‌హామ్‌లోని హాంటెడ్‌ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్‌ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్‌ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘బార్‌గైన్‌ హంట్‌’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్‌ బొమ్మ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ జార్జ్‌ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్‌, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement