తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పర్స రమేశ్ మహేంద్ర దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో ఎప్పుడూ తనకు దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూంటాడు... అతనికి దెయ్యం పట్టిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంటర్‌టైనర్‌గా రూపొందించ నున్నాం’’అని తెలిపారు.