She movie
-
మరో హారర్ చిత్రం - షీ...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్రావు నిర్మిస్తున్న ‘షీ’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పర్స రమేశ్ మహేంద్ర దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘హీరో ఎప్పుడూ తనకు దెయ్యం పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూంటాడు... అతనికి దెయ్యం పట్టిందా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఎంటర్టైనర్గా రూపొందించ నున్నాం’’అని తెలిపారు. -
‘షీ’ ఎవరు?
ఒక అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘షీ’. మహేశ్ ఆర్ట్స్ పతాకంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వరరావ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. పర్స మహేశ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి హీరోయిన్గా నటించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కథ విన్న వెంటనే తేజేశ్వరరావ్గారు ఈ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని చెప్పారు.