శివరాజ్ కుమార్ యాక్షన్‌ షురూ.. ‘ఘోస్ట్‌’ కొత్త పోస్టర్‌ వైరల్‌ | Shiva Rajkumar Pan India Project Ghost Movie Latest Updates | Sakshi
Sakshi News home page

Ghost: శివరాజ్ కుమార్ యాక్షన్‌ షురూ.. ‘ఘోస్ట్‌’ కొత్త పోస్టర్‌ వైరల్‌

Published Fri, Nov 25 2022 3:04 PM | Last Updated on Fri, Nov 25 2022 3:04 PM

Shiva Rajkumar Pan India Project Ghost Movie Latest Updates - Sakshi

కన్నడ స్టార్‌ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఘోస్ట్‌’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బీర్బల్‌’ ఫేం శ్రీని దర్శకత్వం వహిహిస్తున్నాడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. ఇటీవల 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కోసం దాదాపు ఆరు కోట్లతో అదిరిపోయే జైల్ సెట్ వేశారు. అందులోనే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతోన్నారట. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రంలో జయరామ్, అచ్యుత్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement