
రామ్‌చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విభిన్న రకాల స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తి..) ప్రస్తావన ఉంటుందని తెలిసింది.
ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత రామ్‌చరణ్ అండ్ కో షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్‌లో తన నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ విషయాలను చర్చించేందుకు దర్శకుడు సుకుమార్‌తో కలిసి రామ్‌చరణ్ దుబాయ్ వెళ్లారని తెలిసింది. కాగా ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను తిరిగి ఈ వారంలో ప్రారంభించాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో రామ్‌చరణ్‌తో పాటుగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కూడా పాల్గొంటారు.
జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘పెద్ది’ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment