ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం. ఫలితంగా జాబ్ మార్కెట్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్ మార్కెట్‌లో ‘గోస్ట్ జాబ్స్’ ట్రెండ్ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ థ్రెడ్ యూజర్, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గోస్ట్ జాబ్స్ ఏంటో తెలుసా?
గోస్ట్ జాబ్స్ ట్రెండ్
గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంచుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్ కోసం అప్లయ్ చేస్తుంటారు.
అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రాదు. కానీ కంపెనీ వెబ్‌సైట్ హైరింగ్ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్ అనే ఆప్షన్‌ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు.
ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి?
ఘోస్ట్ జాబ్స్ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్ జాబ్‌లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్‌పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని అధ్యయనం తెలిపింది.
ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా?
ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్ రోల్ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్ జాబ్‌గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment