చిన్నప్పుడు ఓ పాట పాడుకునేవాళ్లం.. చెట్టు మీద దెయ్యం, నాకేం భయ్యం అని! అలా పాడతామే కానీ రాత్రి పూట మర్రి చెట్టు కింద కూర్చోవాలంటే వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. కొందరైతే పగటి పూట కూడా దెయ్యాలను గుర్తు చేసుకుని మరీ తెగ భయపడిపోతుంటారు. ఏ చిన్న అలికిడి వినిపించినా అదేదో ప్రేతం పనే అని భయంతో బిగుసుకుపోతుంటారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఓ వ్యక్తి తన గదిలో తన పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా శబ్ధాలు వినిపించాయి. ఆ సమయంలో అతడు తప్ప అక్కడ మరెవరూ లేరు. దీంతో ఇది ప్రాంక్ కాదని అతడికి అర్థమైంది.
వింత శబ్ధాలతో గుండె బేజారు
మరోవైపు కిచెన్‌లో నళ్లా విప్పినట్లుగా కొన్ని చిత్రవిచిత్ర శబ్దాలు రావడంతో గట్టిగా కొట్టుకుంటున్న అతడి గుండె చప్పుడు అతడికే భయాన్ని కలిగించేట్లుగా కొట్టుకుంది. ఏదో శబ్ధం అతడి గదిని సమీపించినట్లు రావడంతో వెంటనే బ్యాగు సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యేందుకు రెడీ అయ్యాడు. అయితే ఒక్క క్షణం కిచెన్ గది తలుపు దగ్గర ఏముందో చూడాలన్న కుతూహలం పుట్టింది. వెంటనే వెనక్కు తిరిగి ఫొటో క్లిక్‌మనిపించి అక్కడ నుంచి జారుకున్నాడు. (చదవండి: ఒంటరిగా మహిళ డ్యాన్స్.. తర్వాత ఏమైందంటే)
తలుపు చాటున ఏదో ఉంది!
తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ ఫొటోను పైపైన చూసిన జనాలు అక్కడేమీ లేదని కొట్టిపారేశారు. కానీ జూమ్ చేసిన క్షణం వారి గుండెలదిరి పడ్డాయి. నిజంగానే తలుపు చాటునుంచి ఏదో తొంగి చూస్తున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. అది దెయ్యమేనని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది సేపు అక్కడే ఉంటే ఏంజరిగేదో తల్చుకుంటేనే భయమేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అయినా అంతటి భయంలోనూ ధైర్యం చేసి దెయ్యాన్ని ఫొటో తీయడం మామూలు విషయం కాదని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: ‘దెయ్యాల పనే అంటారా?!’)
Comments
Please login to add a commentAdd a comment