వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! | Shocking Case A father killed his son into 7 pieces Know The Reason Why | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!

Published Sat, Dec 4 2021 5:18 PM | Last Updated on Sat, Dec 4 2021 6:13 PM

Shocking Case A father killed his son into 7 pieces Know The Reason Why - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడా కసాయి తండ్రి. కన్నబిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఐదేళ్ల పసిపిల్లాడిని దయ్యాలు బూనాయనే మూఢనమ్మకంతో ఇంతదారుణానికి వడికట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పుర్‌కు చెందిన దినేశ్‌ దావర్‌ ఐదేళ్ల పసివాడని కూడా కనికరించకుండా కన్నకొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టేశాడు.

అయితే ఎందుకు చంపావని నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. కొడుకు పుట్టినప్పట్నుంచి తన భార్య ఆరోగ్యం క్షీణించిందని, ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందిగా ఉండేదని, ఈ పరిస్థితుల దృష్ట్యా సమీప గ్రామంలోని గురుమాతను అడుగగా.. కొడుకును దెయ్యాలావహించాయని, అందుకే తన ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పిందట. ఇదంతా విన్న దినేశ్‌ ఐదేళ్ల కొడుకును గొడ్డలితో నరికి చంపి, పూడ్చినట్లు తెలిపాడు. ఈ ఘటన పై కేసు ఫైల్‌ చేసిన అలిరాజ్‌పుర్‌ ఎస్డీఓపీ శ్రద్ధా సొంకర్‌ మాట్లాడుతూ.. నిందితుడు దినేశ్‌ దావర్‌ను అరెస్ట్‌ చేశాం.. అతని కొడుకుకు దెయ్యం ఆవహించినట్లు తెలిపిన మహిళ కోసం గాలింపు చేపట్టినట్లు మీడియాకు వివరించాడు.

చదవండి: ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement