axe
-
మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, మెదక్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం జరిగింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలివి. పట్టణంలోని నర్సాపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌యాదవ్ తన ద్విచక్రవాహనంపై అటు వస్తున్నాడు. పోలీసులు అతని వాహనం ఆపి తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లేశ్‌యాదవ్ తన ఇంటికి వెళ్లి.. కాసేపటికి నర్సాపూర్ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చోటికి చేరుకున్నాడు. తన బైక్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ ఆఫీజ్, హోంగార్డు ఇలియాస్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆఫీజ్ తలపై రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!
భోపాల్: సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడా కసాయి తండ్రి. కన్నబిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఐదేళ్ల పసిపిల్లాడిని దయ్యాలు బూనాయనే మూఢనమ్మకంతో ఇంతదారుణానికి వడికట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్పుర్కు చెందిన దినేశ్ దావర్ ఐదేళ్ల పసివాడని కూడా కనికరించకుండా కన్నకొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టేశాడు. అయితే ఎందుకు చంపావని నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. కొడుకు పుట్టినప్పట్నుంచి తన భార్య ఆరోగ్యం క్షీణించిందని, ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందిగా ఉండేదని, ఈ పరిస్థితుల దృష్ట్యా సమీప గ్రామంలోని గురుమాతను అడుగగా.. కొడుకును దెయ్యాలావహించాయని, అందుకే తన ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పిందట. ఇదంతా విన్న దినేశ్ ఐదేళ్ల కొడుకును గొడ్డలితో నరికి చంపి, పూడ్చినట్లు తెలిపాడు. ఈ ఘటన పై కేసు ఫైల్ చేసిన అలిరాజ్పుర్ ఎస్డీఓపీ శ్రద్ధా సొంకర్ మాట్లాడుతూ.. నిందితుడు దినేశ్ దావర్‌ను అరెస్ట్ చేశాం.. అతని కొడుకుకు దెయ్యం ఆవహించినట్లు తెలిపిన మహిళ కోసం గాలింపు చేపట్టినట్లు మీడియాకు వివరించాడు. చదవండి: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!! -
యువతి ఆత్మహత్య..మంత్రాల నేపంతో దారుణం
సాక్షి, ములుగు: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా... కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. మనిషి ఇంకా తన పాత పద్దతులను వీడటం లేదు , మంత్రాల నేపంతో మనుషులను చంపుతూనే ఉన్నాడు. చెప్పుడు మాటలు విని.. అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. మంత్రాలు నేపంతో ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. చదవండి:బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
చెల్లిని వేధిస్తున్నారని..!
- యువకుడి గొంతు కోసిన బాధితురాలి సోదరులు - పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు ‘మా చెల్లికి నిశ్చితార్థమైంది. రేపోమాపో అత్తారింటికి వెళ్తోంది. ఇక ఆమెను వేధించొద్దు’ అని యువతి సోదరులు తమ చెల్లిని వేధిస్తున్న యువకుడిని వేడుకున్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచూ వారి ఇంటి వైపు వస్తుండటంతో జీర్ణించుకోలేక పోయారు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని కాపుకాశారు. బలవంతంగా లాకెళ్లి దారుణంగా గొంతు కోశారు. యువకుడు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బుధవారం ఆలూరులో చోటు చేసుకుంది. - ఆలూరు రూరల్ ఆలూరు ఎస్సీ కాలనీకి చెందిన సురేంద్ర అదే కాలనీకి చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వెంటపడి తననే పెళ్లి చేసుకోవాలని భయాందోళనకు గురి చేశాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పింది. దీంతో వారు యువకుడిని యువకుడిని మందలించారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. అయినా సురేంద్ర ఆ యువతిని వేధిస్తుండటంతో పాటు పెళ్లి కూడా కాకుండా చూస్తానని హెచ్చరించాడు. దీంతో అతనిపై కక్ష్య కట్టిన ఆ యువతి సోదరులు జగన్, నాగరాజు నెల క్రితమే సురేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. విషయం తెలుసుకున్న సురేంద్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని బెంగళూరుకు వలస పంపారు. కాగా ఇటీవల బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న సురేంద్ర సోదరుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న అంత్యక్రియలకు హాజరైన సురేంద్ర తిరిగి బెంగళూరుకు వెళ్లకుండా గ్రామంలోనే ఉండి మళ్లీ యువతిని వేధించ సాగాడు. తరచూ ఆమె ఇంటి ముందే తిరుగుతుండడంతో జగన్, నాగరాజు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఎలాగైనా అతడిని చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు సురేంద్ర బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఆదిఆంధ్ర పాఠశాలోనికి సురేంద్రను బలవంతంగా లాక్కెళ్లారు. ముందుగానే అక్కడ ఉంచిన కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో చనిపోయాడని భావించి నిందితులు వెళ్లిపోయారు. కొద్ది సేపటికి సమాచారం అందుకున్న యువకుడి తల్లి, బంధువులు అక్కడికి చేరుకుని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్‌ను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు పంపారు. ఆలూరు ఎస్ఐ ధనుంజయ, పోలీసులు సురేంద్ర తల్లి మారెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
వ్యక్తిపై గొడ్డలితో దాడి
ఎమ్మిగనూరు రూరల్ : పార్లపల్లిలో స్థలంలో ముళ్లచెట్ల తొలగింపు విషయంపై జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జమీర్ ఏడేళ్ల క్రితం ఖాళీ స్థలాన్ని కొన్నాడు. ఇతని స్థలం పక్కనే అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా కూడా 6 నెలల క్రితం స్థలం కొన్నాడు. ఇద్దరి స్థలాల్లో మధ్య ఉన్న దారిలో ముళ్లచెట్లు పెరగడంతో వాటిని అబ్దుల్లా తొలగించాడు. తమ స్థలంలోని చెట్లను ఎలా తొలగిస్తామని జమీర్ అబ్దుల్లాను అడగగా మాటమాట పెరిగింది. జమీర్‌పై అబ్దుల్లా అతని కుమారులు దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
డబ్బు విషయమై గొడవ.. గొడ్డళ్లతో దాడి
సంతమాగులూరు(ప్రకాశం జిల్లా): డబ్బు విషయంలో జరిగిన గొడవతో ఓ వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారు. సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తిపై పెద్ద శ్రీరాములు, చిన్న శ్రీరాములు అనే వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. డబ్బు విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ దాడిలో గాయపడిన అంజనేయులును చికిత్స నిమిత్తం నరసారావుపేట ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
భర్తను దారుణంగా హత్య చేసిన మహిళ
-
వేధింపులు తాళలేక..
- మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు - అనాథగా మారిన ముగ్గురు చిన్నారులు శ్రీశైం ప్రాజెక్టు: నిత్యం మద్యం తాగి హింసిస్తున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సున్నిపెంట శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. తండ్రి మృతి, తల్లి జైలు పాలు కావడంతో ముగ్గురు చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సున్నిపెంటకు చెందిన పానుగంటి రంగనాయకులు (33)కు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హసనాబాద్‌కు చెందిన రాములమ్మతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 6వ తరగతి చదువుతున్న కుమార్తె రంగలక్ష్మి, మూడు, రెండవ తరగతి చదువుతున్న రంగసాయి, అశోక్ సంతానం. ఽరంగనాయకులు హమాలీ పని చేసే వాడు. అయితే మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధించేవాడు. అలాగే కుటుంబం గడవటానికి పైసా కూడా ఇచ్చేవాడు కాదు. పిల్లలను పోషించేందుకు రాములమ్మ స్థానికంగా ఇళ్లలో పని చేసేది. అలా సంపాదించిన డబ్బును కూడా మద్యానికి ఇవ్వాలని రంగనాయకులు భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్యాపిల్లలను తీవ్రంగా కొట్టాడు. అనంతరం అందరిని చంపేస్తానని గొడ్డలితో బెదిరించడంతో భయపడిన ఆమె రాత్రంతా ఓ చోట తలదాచుకుంది. శనివారం తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న ఆమెకు గొడ్డలిని పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్న భర్త కనిపించాడు. ఎప్పటికైన భర్తతో తనకు, బిడ్డలకు ప్రాణాప్రాయం ఉందని భావించింది గొడ్డలితో అతని తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ , ఎస్ఐ ఓబులేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు కారణాలు తెలుసుకుని రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ప్రస్తుతానికి బంధువులు చేరదీశారు. -
గొడ్డలితో కూలీని చంపిన సూపర్వైజర్
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): సూపర్వైజర్కు, కూలీకి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడు మృతిచెందగా.. సూపర్వైజర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్న సుధాకర్ (35)కు సూపర్వైజర్ బ్రహ్మయ్యకు మధ్య ఈ రోజు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య పక్కనే ఉన్న గొడ్డలితో సుధాకర్ తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్యకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
గొడ్డలితో దాడి: ఒకరు మృతి
మైలవరం: వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలివీ... గ్రామానికి చెందిన ఉడుమల శంకర్(48), లక్ష్మీనర్సయ్యల కుటుంబాలకు ఇంటి స్థలం విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం వారు ఘర్షనకు దిగారు. లక్ష్మీనారాయణ గొడ్డలితో శంకర్‌పై దాడి చేయటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కోవెలకుంట్ల సమీపంలోకి వెళ్లేసరికి చనిపోయాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిపై హత్యాయత్నం
రామన్నపేట (నల్లగొండ) : కన్నకొడుకే గొడ్డలితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలెంనగర్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ జమాల్ (65) రెండో కుమారుడు సయ్యద్ మక్సూద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మక్సూద్ మద్యం మత్తులో తండ్రి జమాల్‌పై గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జమాల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గొడ్డలితో భార్య ముక్కు తెగ్గొట్టాడు..
నారాయణఖేడ్ (మెదక్) : తాగిన మైకంలో ఓ వ్యక్తి భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె ముక్కు తెగిపోవటంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణం దత్తాత్రేయకాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఉబ్ది పాండు, కేశమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా పాండు తరచూ తప్పతాగి వచ్చి భార్యను కొట్టేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. ఇదే విధంగా ఇటీవల కేశమ్మ పుట్టింటికి వెళ్లిపోగా మద్యం తాగనని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుని భార్యను తెచ్చుకున్నాడు. అయినప్పటికీ బుధవారం రాత్రి తల్లి పోచమ్మతో కలసి పూటుగా మద్యం తాగాడు. అనంతరం పాండు భార్య, తల్లితో గొడవకు దిగాడు. కోపంలో ఉన్న పాండు భార్య కేశమ్మపై గొడ్డలితో వేటువేయగా ఆమె ముక్కు తెగి, తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన కాలనీవాసులు తల్లి, కొడుకుకు దేహశుద్ధి చేశారు. అనంతరం గాయాలపాలైన ముగ్గురినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. కేశమ్మ తండ్రి కేశయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
బావమరిదిపై గొడ్డలితో దాడి చేసిన బావ
మానకొండూరు (కరీంనగర్) : భూ వివాదంలో బావ.. బావమరిదిపై గొడ్డలితో దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది భార్య పై కూడా దాడికి దిగాడు. దీంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన రొడ్డె కొమరయ్యకు, బావమరిది అయిన రమేష్‌కు మధ్య భూమి విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు అన్యాయం చేశాడని ఆగ్రహించిన కొమరయ్య గొడ్డలితో బావమరిది రమేష్ పై దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని భార్య ప్రమీలపై కూడా దాడి చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రొడ్డె కొమరయ్యను అరెస్ట్ చేశారు. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
తలకొండపల్లి (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అంజయ్య మద్యం మత్తులో శనివారం రాత్రి భార్య అంజమ్మ(50)తో గొడవ పడ్డాడు. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో గొడవపడి ఆవేశంలో గొడ్డలితో ఆమె తలపై వేటు వేశాడు. తీవ్రంగా గాయపడిన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. -
ఈ మెయిల్స్ వల్ల 1,900 ఉద్యోగాలు గోవిందా!
సిడ్నీ: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చాలా మంది ఆశావాహులు భావిస్తారు. కానీ, ఆస్ట్రేలియాలో మాత్రం దీనివల్ల ఏకంగా 1,900 భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ మధ్య కాలంలో ఈమెయిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఇక ఉత్తరాల బట్వాడా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పోస్ట్ అనే ఓ సంస్థ కూడా వివిధ సంస్థలు వ్యక్తులకు ఉత్తరాలు చేరవేసే సంస్థను నిర్వహిస్తుండేది. దీని ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుండేది. అయితే, రాను రాను ఈమెయిల్స్ వాడకం ఎక్కువై ఉత్తరాలు ఉపయోగించేవారి సంఖ్య తక్కువవడంతో ఆ సంస్థ ఆదాయం పడిపోయింది. పైగా లావాదేవీలు పది శాతం తగ్గాయి. దీంతో ఉత్తరాలు చేరవేసేవారు పని లేకుండా ఖాళీగా ఉండటం, అనుకున్న లావాదేవీలు జరగకపోవడంతో మూడేళ్లలో మొత్తం 1,900 మందిని తొలగించినున్నామని ప్రకటించింది. -
భార్యను గొడ్డలితో నరికిన భర్త
నల్లగొండ: భార్యను హతమార్చేందుకు ఓ భర్త ప్రయత్నించాడు. ఆమెను మట్టుబెట్టేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ మండలం చందనపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్యకు ఆరేళ్ల కిందట నాగమణితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భార్య, భర్తలు ఇద్దరు తరచూ గొడవపడేవారు. శనివారం కూడా వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పాపయ్య, నాగమణిని గొడ్డలితో నరికాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పాపయ్యను ప్రతిఘటించి నాగమణిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ప్రస్తుతం నగరంలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చెల్లిను గొడ్డలితో నరికిన అన్న
కరీంనగర్: క్షణికావేశంతో సొంత సోదరిపై గొడ్డలితో దాడిచేసి చంపేశాడో కిరాతక అన్నయ్య..ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఆత్మకూరు గ్రామానికి చెందిన రాజంలింగం(28) వ్యవసాయ కూలిగా జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం సోదరి లత(20)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రాజంలింగం పక్కనే ఉన్న గొడ్డలితో సోదరిపై విచక్షణారహితంగా దాడిచేసి నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. వీరి తల్లిదండ్రులు పదేళ్ల కిందటే మరణించారు. అప్పటినుంచి ఇద్దరు సోదరులు ఐదుగురు అక్కాచెల్లెళ్లెను పెంచి పెద్దచేశారు. రాజంలింగం స్థానికంగా ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటుండగా మరో సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరగడంతో గ్రామం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
యువకుడిపై గొడ్డలితో దాడి
మూసాపేట (హైదరాబాద్) :గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ మూసాపేటలో ఉన్న జనతానగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన కె.గిరి(18) అనే వ్యక్తి హైదరాబాద్‌లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జనతానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అయితే సోమవారం సాయంత్రం గుర్తుతెలియని దుండుగులు గిరిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో అతనిని స్థానికులు మెరుగైన వైద్యం కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమా? లేక స్నేహితులు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
15 మంది టీచర్లపై వేటు
కరీంనగర్: జిల్లాలో పదిహేను మంది టీచర్లపై వేటుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో వారిని తొలగించారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం అనుమతి కూడా తీసుకోకుండా విధులను ఎగ్గగొట్టిన ఆ టీచర్లను శాశ్వతంగా తొలగించారు. -
అన్నను హతమార్చిన సోదరుడు
మెదక్ : మెదక్ జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేటలో దారుణం జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అన్ననే....సోదరుడు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా తమ్ముడు... తన సోదరుడిని గొడ్డలితో నరికి చంపాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.