భూ వివాదంలో బావ.. బావమరిదిపై గొడ్డలితో దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది భార్య పై కూడా దాడికి దిగాడు.
మానకొండూరు (కరీంనగర్) : భూ వివాదంలో బావ.. బావమరిదిపై గొడ్డలితో దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన బావమరిది భార్య పై కూడా దాడికి దిగాడు. దీంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది.
గ్రామానికి చెందిన రొడ్డె కొమరయ్యకు, బావమరిది అయిన రమేష్‌కు మధ్య భూమి విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో తనకు అన్యాయం చేశాడని ఆగ్రహించిన కొమరయ్య గొడ్డలితో బావమరిది రమేష్ పై దాడి చేశాడు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని భార్య ప్రమీలపై కూడా దాడి చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రొడ్డె కొమరయ్యను అరెస్ట్ చేశారు.