డబ్బు విషయమై గొడవ.. గొడ్డళ్లతో దాడి | a dispute over money, Axe attack | Sakshi
Sakshi News home page

డబ్బు విషయమై గొడవ.. గొడ్డళ్లతో దాడి

Published Sun, Nov 13 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

a dispute over money, Axe attack

సంతమాగులూరు(ప్రకాశం జిల్లా): డబ్బు విషయంలో జరిగిన గొడవతో ఓ వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారు. సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తిపై పెద్ద శ్రీరాములు, చిన్న శ్రీరాములు అనే వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు.

డబ్బు విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ దాడిలో గాయపడిన అంజనేయులును చికిత్స నిమిత్తం నరసారావుపేట ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement